Telugu Global
National

ఎక్స్‌ప్రెస్‌ రైలులో చెలరేగిన మంటలు

మంటలను గమనించిన వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు హుటాహుటిన బయటికి వచ్చేయడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు.

ఎక్స్‌ప్రెస్‌ రైలులో చెలరేగిన మంటలు
X

తాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఓల్లా - తుగ్లకాబాద్‌ మధ్య సర్వీసులందిస్తున్న ఈ రైలులో సోమవారం మంటలు చెలరేగాయి. తొలుత డీ3 కోచ్‌ నుంచి చెలరేగిన మంటలు ఆ తర్వాత డీ2, డీ4 కోచ్‌లకు కూడా వ్యాపించాయి. ఈ ఘటనలో డీ3, డీ4 కోచ్‌లు మంటల్లో దగ్ధమయ్యాయి. డీ2 కోచ్‌ మాత్రం పాక్షికంగా దగ్ధమైంది.

ఆగ్నేయ ఢిల్లీలోని సరితా విహార్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలను గమనించిన వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు హుటాహుటిన బయటికి వచ్చేయడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితమేనని వారు తెలిపారు. నార్తర్న్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ శోభన్‌ చౌదరి మాట్లాడుతూ ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దీనికోసం దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం 4.24 గంటల సమయంలో తాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు వ్యాపించినట్టు సమాచారం అందింది. 8 ఫైర్‌ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

First Published:  3 Jun 2024 6:05 PM GMT
Next Story