Telugu Global
National

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఎందుకు పనిచేయలేదంటే..

తమకు ఎదురైన సమస్యలను ఇతర సోషల్‌ మీడియాల్లో పోస్టులు పెట్టారు. త్వరగా సర్వీసులు పునరుద్ధరించాలని కోరారు. దీంతో #facebookdown, #instagramdown హ్యాష్‌ట్యాగ్స్‌ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఎందుకు పనిచేయలేదంటే..
X

ప్రముఖ సోషల్ మీడియా యాప్స్‌ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సర్వీసులకు మంగళావరం సాయంత్రం కాసేపు అంతరాయం ఏర్పడింది. మెటా సంస్థకు చెందిన ఈ సర్వీసులు సాంకేతిక సమస్య కారణంగా భారత్‌ సహా పలు దేశాల్లో స్తంభించాయి.

దీంతో నెటిజన్లు తమ అకౌంట్లను ఆపరేట్‌ చేయలేక ఇబ్బందులు పడ్డారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లు వాటంతటవే లాగ్‌ ఔట్‌ అయిపోయాయి. లాగిన్‌ అవ్వడానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. దీంతో యూజర్లు అయోమయానికి గురయ్యారు. అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందని.. ఫేస్‌బుక్‌/ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ క్రాష్‌ అయ్యి ఉండొచ్చని కంగారుపడ్డారు.

తమకు ఎదురైన సమస్యలను ఇతర సోషల్‌ మీడియాల్లో పోస్టులు పెట్టారు. త్వరగా సర్వీసులు పునరుద్ధరించాలని కోరారు. దీంతో #facebookdown, #instagramdown హ్యాష్‌ట్యాగ్స్‌ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.

వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యపై మెటా కమ్యూనికేషన్స్‌ స్పందించింది. సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ప్రకటన విడుదలైన కాసేపటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పనిచేయడం మొదలుపెట్టాయి.

First Published:  6 March 2024 9:01 AM IST
Next Story