Telugu Global
National

బీహార్‌ కేబినెట్‌ విస్తరణ..మంత్రులుగా ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు.

బీహార్‌ కేబినెట్‌ విస్తరణ..మంత్రులుగా ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు
X

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఏడుగురు ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. వారిలో జిబేష్ కుమార్ , సంజయ్ సరోగి, సునీల్ కుమార్, రాజు కుమార్ సింగ్, మోతీ లాల్ ప్రసాద్, విజయ్ కుమార్ మండల్, కృష్ణ కుమార్ మంటూ ఉన్నారు. వీరంతా భారతీయ జనత పార్టీ ఎమ్మెల్యే. నూతనంగా ఎన్నికైన మంత్రులతో గవర్నర్ మహహ్మద్ ఆరిఫ్ ఖాన్ రాజ్ భవన్‌లో ప్రమాణం చేయించారు.

వీరి చేరికతో రాష్ట్రంలోని మంత్రుల సంఖ్య 36కు చేరుకుంది.వీరిలో 21 మంది బీజేపీ, 13 మంది జేడీయూ, ఒకరు హెచ్‌ఏఎం, ఒకరు స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. ఈ సంవత్స చివరలో బిహార్ శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కేబినెట్ విస్తరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. బీహార్‌లో మొత్తం 243 సీట్లు ఉండగా ఎన్డీఏ కూటమికి 131 సీట్లు ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణకు ముందు బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి దిలీప్ జైస్వాల్ మంత్రి పదవికి రిజైన్ చేశారు.

First Published:  26 Feb 2025 8:00 PM IST
Next Story