Telugu Global
National

మహారాష్ట్రలో ఎన్డీఏ వైపే ఎగ్జిట్‌పోల్స్‌

ఝార్ఖండ్‌లోనూ బీజేపీ వైపే ఓటర్లు మొగ్గుచూపినట్లు సర్వే అంచనా

మహారాష్ట్రలో ఎన్డీఏ వైపే ఎగ్జిట్‌పోల్స్‌
X

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. హర్యానాలో ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలకు భిన్నంగా బీజేపీ అక్కడ మూడోసారి అధికారంలోకి రావడంతో ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల గురించి ఎగ్జిట్‌పోల్స్‌ ఏం చెప్పబోతున్నాయనే ఉత్కంఠకు సర్వేలు తెరదించాయి. మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ), మహాయుతి ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. తాజాగా వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌లో మహారాష్ట్ర ఓటర్లు శివసేన (శిండే), బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి మరోసారి పట్టం కట్టినట్లు అంచనా వేశాయి. ఇక ఝార్ఖండ్‌లోనూ బీజేపీ వైపే ఓటర్లు మొగ్గుచూపినట్లు సర్వే అంచనాల బట్టి తెలుస్తోంది.

మహారాష్ట్ర

పీపుల్స్‌ పల్స్‌: మహాయుతి-182, ఎంవీఏ -97, ఇతరులకు 9 సీట్లు

సీఎన్‌ఎస్‌-న్యూస్‌18: మహాయుతి-154, ఎంవీఏ -128, ఇతరులకు 6 సీట్లు

మాట్రిజ్‌: మహాయుతి-150-170, ఎంవీఏ - 110-130 , ఇతరులకు 8-10 సీట్లు

పీ-మార్క్‌: మహాయుతి-137-157, ఎంవీఏ -126-146, ఇతరులకు 2-8 సీట్లు

టైమ్స్‌ నౌ-జేవీసీ:మహాయుతి-105-126, ఎంవీఏ -68-91, ఇతరులకు 8-12 సీట్లు

లోక్‌శాహీ మరాఠీ రుద్ర: మహాయుతి-128-142, ఎంవీఏ -125-140, ఇతరులకు 18-23 సీట్లు

ఝార్ఖండ్‌

పీపుల్స్‌ పల్స్‌: ఎన్డీఏ-46-58, ఇండియా కూటమి -24-37, ఇతరులకు 6-10 సీట్లు

మాట్రిజ్‌ : ఎన్డీఏ-42-47, ఇండియా కూటమి -25-30, ఇతరులకు 1-4 సీట్లు

టైమ్స్‌ నౌ-జేవీసీ: ఎన్డీఏ-40-44, ఇండియా కూటమి -20-40, ఇతరులకు 1-1 సీట్లు

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా... మెజార్టీ మార్క్‌ 145. అధికార మహాయుతిలో బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేశాయి. విపక్ష మహావికాస్‌ అఘాడీలో కాంగ్రెస్‌ 101, శివసేన (ఉద్ధవ్‌) 95, ఎన్సీపీ (శరద్‌ పవార్‌) 86 సీట్లలో పోటీ చేశాయి. బీఎస్పీ 237, ఎంఐఎం 17 స్థానాల్లో పోటీ చేశాయి.

ఝార్ఖండ్‌లో మొత్తం 81 స్థానాలుండగా మెజారిటీ మార్క్‌ 41. బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ రెండు, లోక్‌జన్‌శక్తి (రామ్‌ విలాస్‌) పార్టీ ఒక స్థానంలో పోటీ చేశాయి. అధికార జేఎంఎం 43, కాంగ్రెస్‌ 30, ఆర్జేడీ 6, సీపీఐ (ఎంఎల్‌) నాలుగు చోట్ల పోటీ చేశాయి.

First Published:  20 Nov 2024 7:45 PM IST
Next Story