Telugu Global
National

హర్యానాలో ఎలక్షన్లు.. డేరా బాబాకు పెరోల్

డేరా బాబాకు మరోసారి పెరోల్ లభించింది. మరో నాలుగు రోజుల్లో హర్యానా శాసన సభ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేరా బాబా పెట్టుకున్న పెరోల్‌ పిటిషన్‌ను ఈసీ ఆమోదించింది.

హర్యానాలో ఎలక్షన్లు.. డేరా బాబాకు పెరోల్
X

డేరా బాబాకు మరోసారి పెరోల్ లభించింది. మరో నాలుగు రోజుల్లో హర్యానా శాసన సభ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేరా బాబా పెట్టుకున్న పెరోల్‌ పిటిషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. బాబా పెరోల్ పిటిషన్‌కు ఈసీ అనుమతివ్వడంతో హర్యానా సర్కార్ ఆయన విడుదలకు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. ఎన్నికలు ఉన్న ప్రతి సారి డేరా బాబాకు ప్రభుత్వం పెరోల్ మంజూరు చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడినందుకు ఈ ప్లాన్ అని హస్తం పార్టీ నాయకులు పేర్కొన్నారు. కాగా అతని పెరోల్ రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీసే లక్ష్యంతో వారిని విడుదల చేశారని ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అన్నారు . హత్య, అత్యాచారం, అభియోగాలు మోపిన గుర్మీత్ సింగ్‌ను ఎన్నికలకు 20 రోజుల ముందు విడుదల చేశారని, అలాగే కేజ్రీవాల్ కూడా బయటకు వస్తే హర్యానాలో ప్రచారం చేస్తారని, ఇది తమకు ఉపయోగపడుతుందని కమలం పార్టీ భావిస్తున్నట్లుగా ఉందని వాద్రా తెలిపారు. కానీ బీజేపీ ఊహించినట్లుగా వారు కాంగ్రెస్ పార్టీ గెలుపును దెబ్బతీయలేరన్నారు. హర్యానా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి, భారీ మెజార్టీతో గెలిపిస్తారని వాద్రా ధీమా వ్యక్తం చేశారు. ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడిన కేసులో అతనికి కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం అతడు హర్యానాలోని రోహ్‌తక్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే వివిధ కారణాలతో గత తొమ్మిది నెలల్లో ఆయనకు రెండు సార్లు పెరోల్‌ లభించగా తాజాగా మరోసారి అతనికి పెరోల్ లభించింది.

First Published:  1 Oct 2024 6:33 PM IST
Next Story