బిగ్ స్క్రీన్‌పై ఎన్నికల ఫలితాలు.. - టికెట్ల అమ్మకాలు ప్రారంభం
సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ జూన్ ఒకటో తేదీన జరగనున్న విషయం తెలిసిందే. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆరోజు యావత్ దేశ ప్రజలు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోవడం ఖాయం.
ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని బిగ్ స్క్రీన్‌పై ఫలితాలను అందుబాటులోకి తెస్తున్నాయి పలు సినీ థియేటర్ల యాజమాన్యాలు. మహారాష్ట్రలోని కొన్ని సినిమా థియేటర్లు ఈ అవకాశాన్ని అందుబాటులోకి తెస్తున్నాయి. ఏకంగా 6 గంటల పాటు ఫలితాలను థియేటర్లలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రసారం చేయనున్నారు. ఇందుకోసం టికెట్ ధరలు రూ.99 నుంచి రూ.300 వరకు నిర్ణయించడం విశేషం.
సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ జూన్ ఒకటో తేదీన జరగనున్న విషయం తెలిసిందే. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆరోజు యావత్ దేశ ప్రజలు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోవడం ఖాయం. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ఫలితాలను బిగ్ స్క్రీన్‌పై ప్రత్యక్ష ప్రసారం చేయాలనే ఆలోచనతో ఆయా థియేటర్ల యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ముంబైలోని ఎస్‌ఎం5 కల్యాణ్, సియాన్, కంజూర్ మార్గ్‌లోని మూవీ మ్యాక్స్ థియేటర్లు, ఠాణెలోని ఎటర్నిటీ మాల్, వండర్ మాల్, పుణెలోని మూవీమ్యాక్స్, నాగ్‌పూర్‌లోని మూవీ మ్యాక్స్ ఎటర్నిటీ తదితర థియేటర్లు ఈ అవకాశం కల్పించేందుకు ఇప్పటికే పేటీఎం వంటి వేదికల ద్వారా బుకింగ్‌లు కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని థియేటర్లు హౌస్‌ఫుల్ అయినట్టు తెలుస్తోంది. టికెట్ బుకింగుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను కొందరు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి.