Telugu Global
National

ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలి...ఉద్దవ్ ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు

మా పేరు, చిహ్నాన్ని అవతలి వర్గం వారు తీసుకున్నా, మా థాకరే పేరును మాత్రం వారు తీసుకోలేరు. బాలాసాహెబ్ ఠాక్రే కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. ఢిల్లీ సహాయంతో కూడా వారు దానిని పొందలేరు, ”అని ఉద్దవ్ ఠాక్రే అన్నారు.

ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలి...ఉద్దవ్ ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు
X

శివసేన పేరును, గుర్తును కోల్పోయిన రెండు రోజుల తర్వాత ఈ రోజు ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ, ఎన్నికల‌ కమిషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్లను ప్రజలే ఎన్నుకోవాలని ఆయన‌ అన్నారు.

"సుప్రీం కోర్టులో కేసు ఉండగా ఈసీ అంత తొందరపడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?'' అని ఆయన ప్రశ్నించారు.

“మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు , నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర అన్నీ దోచుకున్నారు, మీరు ఇక్కడే ఎందుకు ఉన్నారు? మా పేరు, చిహ్నాన్ని అవతలి వర్గం వారు తీసుకున్నా, మా థాకరే పేరును మాత్రం వారు తీసుకోలేరు. బాలాసాహెబ్ ఠాక్రే కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. ఢిల్లీ సహాయంతో కూడా వారు దానిని పొందలేరు, ”అని థాకరే కార్యకర్తల‌తో అన్నారు.

ప్రజాస్వామ్య సంస్థల సహాయంతో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని ఆరోపించారు. మమతా బెనర్జీ, శరద్ పవార్, నితీష్ కుమార్ తో సహా అనేక మంది నుండి తనకు మద్దతుగా కాల్స్ వచ్చాయని ఉద్దవ్ చెప్పారు.

ఈరోజు బీజేపీ మనతో ఏం చేసిందో, అందరితోనూ అదే చేస్తుంది. ఇదే కొనసాగితే 2024 తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఉండవని అన్నారు.

2019లో బిజెపితో దశాబ్దాల నాటి పొత్తును ముగించినప్పుడు కూడా తాను హిందుత్వను విడిచిపెట్టలేదని థాకరే నొక్కిచెప్పారు.

అంధేరీలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా తమ పార్టీ అభ్యర్థి ఎన్నికల సంఘం ఇచ్చిన పేరును ఉపయోగించుకున్నారని థాకరే అన్నారు. "మేము శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రేను ఉపయోగించాము. మేము ఎన్నికల్లో గెలిచాము. ఆ సమయంలో షిండేకు ఎన్నికల్లో పోరాడే ధైర్యం కూడా లేదు" అని ఆయన అన్నారు.

First Published:  20 Feb 2023 4:30 PM IST
Next Story