వానాకాలమే, కానీ వానల్లేవ్.. ఐదేళ్లలో ఇదే కనిష్ట వర్షపాతం
ఐదేళ్లలో ఈ ప్రభావం గరిష్టానికి చేరుకుంది. 2018నుంచి ఇప్పటి వరకు వర్షాలను పరిశీలిస్తే.. రుతుపవనాల ద్వారా నమోదైన వర్షపాతం ఈ ఏడాది అత్యల్పం అని తేలింది. ఆగస్ట్ నెలలో దేశవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది.
ఇటీవల హిమాచల్ ప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. తెలంగాణలో కూడా రెండు విడతల్లో వానలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వీటికి రుతుపవనాలకు అస్సలు సంబంధం లేదు. మరోవైపు మిగతా రాష్ట్రాలన్నీ వర్షాభావ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నాయి. అసలు ఇది వానాకాలమేనా అనుకునే పరిస్థితి ఉంది. గడచిన ఐదేళ్లలో వానాకాలంలో రుతుపవనాలతో కురిసిన వర్షం ఈ ఏడాదే అత్యల్పం. దీనికి కారణం ఎల్ నినో అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
లానినా ప్రభావంతో గడచిన దశాబ్దంలో వానలు, వరదలు, తుఫాన్లతో సతమతమయ్యారు ప్రజలు. ఇప్పుడు ఎల్ నినో ప్రభావం మొదలైంది. అంటే వర్షాభావ పరిస్థితులన్నమాట. ఐదేళ్లలో ఈ ప్రభావం ఇప్పుడు గరిష్టానికి చేరుకుంది. 2018నుంచి ఇప్పటి వరకు వర్షాలను పరిశీలిస్తే.. రుతుపవనాల ద్వారా నమోదైన వర్షపాతం ఈ ఏడాది అత్యల్పం అని తేలింది. ఆగస్ట్ నెలలో దేశవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది.
ఇదే పరిస్థితి కొనసాగితే..
ఈ పరిస్థితి కొనసాగితే వర్షాలు లేకపోవడం వల్ల పంట దిగుబడులు పూర్తిగా తగ్గే అవకాశముంది. దేశంలో ఆహార ద్రవ్యోల్భణం పెరుగుదలకు దారి తీసే ప్రమాదం ఉంది. చక్కెర, పప్పులు, బియ్యం, కూరగాయలు వంటి వాటి ఉత్పత్తి తగ్గితే ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ పరిణామాలు ఏర్పడితే బియ్యం, చక్కెర, గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్, వాటిపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. రుతుపవనాల కొరత ఉన్నా కూడా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సాధారణ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది.