Telugu Global
National

గుడిసెపై బోల్తా పడిన ఇసుక లారీ, 8 మంది మృతి

మంగళవారం రాత్రి కాన్పూర్ నుంచి హర్దోయ్ వైపు వెళుతున్న ఓ లారీ గుడిసెపై బోల్తా పడింది. దీంతో గుడిసెలో ఉన్నవారంతా అక్కడికక్కడే మరణించారు.

గుడిసెపై బోల్తా పడిన ఇసుక లారీ, 8 మంది మృతి
X

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇసుక లోడుతో కూడిన ఓ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గుడిసెపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులతో సహా 8 మంది మృతి చెందారు. ఒక బాలిక గాయాలపాలయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయాలైన బాలికను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.

స్థానికుల వివరాల ప్రకారం.. మల్వాన్ పట్టణంలోని ఉన్నావ్ రోడ్డులోని ఆక్ట్రాయ్ నంబర్ 2 సమీపంలో రోడ్డుపక్కన గుడిసె వేసుకొని అవధేష్ అలియాస్ బల్లా అనే ఒక వ్యక్తి కుటుంబ సమేతంగా నివసిస్తున్నాడు. మంగళవారం రాత్రి కాన్పూర్ నుంచి హర్దోయ్ వైపు వెళుతున్న ఓ లారీ గుడిసెపై బోల్తా పడింది. దీంతో గుడిసెలో ఉన్నవారంతా అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో భార్యాభర్తలు, నలుగురు పిల్లలు, బంధువులు ఉన్నారు. ఈ రోడ్డు పక్కన మొత్తం నాట్ కమ్యూనిటీ ప్రజల గుడిసెలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి చేరుకున్న జనం పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంలో అవధేష్ కుమార్తె బిట్టు తీవ్రంగా గాయపడింది. ఆమెను మల్లవన్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో చేర్పించారు. హర్దోయ్ రోడ్డు ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి తగు వైద్యం అందించాలని జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.

First Published:  12 Jun 2024 5:12 AM GMT
Next Story