ఈడీ నా హక్కును ఉపయోగించుకోనివ్వడంలేదు... కల్వకుంట్ల కవిత
ఢిల్లీలో కవిత మీడియాతో మాట్లాడుతూ, తనను విచారించడానికి ఈడీ ఎందుకు అంత తొందరపడుతున్నదో అర్దం కావడంలేదని ఆమె అన్నారు. 15వ తేదీ తర్వాత విచారణకు వస్తానని తాను అడుగగా లేదు11 కే రావాలని ఈడీ అంటోందని, ఈడీకి ఎందుకంత తొందర అని కవిత ప్రశ్నించారు.
దర్యాప్తు సంస్థలు మహిళలను విచారించేప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించేందుకు చట్టం అవకాశం కల్పిస్తున్నదని , ఈడీ ఆ హక్కును తాను ఉపయోగించుకోవడానికి నిరాకరిస్తున్నదని బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, తనను విచారించడానికి ఈడీ ఎందుకు అంత తొందరపడుతున్నదో అర్దం కావడంలేదని ఆమె అన్నారు. 15వ తేదీ తర్వాత విచారణకు వస్తానని తాను అడుగగా లేదు11 కే రావాలని ఈడీ అంటోందని, ఈడీకి ఎందుకంత తొందర అని కవిత ప్రశ్నించారు.
దర్యాప్తు సంస్థలు మహిళలను విచారించేటప్పుడు వారి ఇంటి కొచ్చి విచారించాలని చట్టంలో ఉందని, లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని చెప్పిన కవిత మహిళలకున్న ఈ హక్కుల కోసం అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తానని ఆమె తెలిపారు.
విపక్షాలు పరిపాలించే రాష్ట్రాలకు ముందు ఈడీ వస్తుందని, ఆ తర్వాత మోడీ వస్తారని కవిత మండిపడ్డారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని అణిచి వేయడానికి మోడీ సర్కార్ అక్రమ కేసులతో వేధిస్తున్నదని ఆమె ఆరోపించారు.
''ఈడీ విచారణను ఎదుర్కోవడానికి నేను సిద్దంగా ఉన్నాను. నేనేమీ తప్పు చేయలేదు. నేనెందుకు భయపడాలి ? వారడిగే ప్రతి ప్రశ్నకు జవాబిస్తాను. ఈడీకి వంద శాతం సహకరిస్తాను'' అని కవిత అన్నారు.
తెలంగాణ నాయకులను వేధించడం మోడీకి అలవాటుగా మారిపోయిందని, మోడీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
రేపు జంతర్ మంతర్ వద్ద భారత జాగృతి తరపున మహిళా రిజర్వేషన్ కోసం తన దీక్షా కార్యక్రమం జరుగుతుందని, 18 పార్టీల నాయకులు ఆ దీక్షకు మద్దతుగా జంతర్ మంతర్ కు వస్తారని ఆమె తెలిపారు.