Telugu Global
National

మంత్రి పర్సనల్ సెక్రటరీ ఇంట్లో నోట్ల గుట్టలు.. ఎన్నికోట్లు దొరికాయంటే..!

కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు దొరకడంతో అధికారులు సైతం షాక్ తిన్నారు. మొత్తం నగదు దాదాపు రూ. 25 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

మంత్రి పర్సనల్ సెక్రటరీ ఇంట్లో నోట్ల గుట్టలు.. ఎన్నికోట్లు దొరికాయంటే..!
X

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జార్ఖండ్‌లో పెద్దఎత్తున నగదు లభ్యమైంది. రాంచీలోని పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఆలంగీర్ ఆలం పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ ఇంటి నుంచి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు దొరకడంతో అధికారులు సైతం షాక్ తిన్నారు. మొత్తం నగదు దాదాపు రూ. 25 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాగులు, సూట్‌కేసులు, పాలిథిన్‌ కవర్లలో ఈ నోట్ల కట్టలను చుట్టి పెట్టారు.


పెన్‌డ్రైవ్ డేటా ఆధారంగా..

వీరేంద్రరామ్ కేసులో సంజీవ్‌లాల్ ఇంట్లో ఈడీ భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుంది. చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్‌కు రూ.100 కోట్ల ఆస్తులు కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాదే ఈడీ ఆయన్ని అరెస్టు చేసింది. కొందరు జార్ఖండ్ రాజకీయ నాయకులతో లావాదేవీలు జరిపిన పెన్‌డ్రైవ్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న సమాచారం ఆధారంగానే తాజాగా మంత్రి పర్సనల్ సెక్రటరీ ఇంట్లోనూ భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు. PMLA ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్‌ కింద దాదాపు ఆరు ప్రదేశాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తోంది.

First Published:  6 May 2024 10:51 AM IST
Next Story