ఈ రోజు ఈడీ విచారణ పూర్తి...ఈడీ కార్యాలయం నుంచి బైటికి వచ్చిన ఎమ్మెల్సీ కవిత
ఇప్పుడే కవిత ఈడీ కార్యాలయం నుంచి బైటికి వచ్చారు. దాదాపు 11 గంటల పాటు ఈడీ అధికారులు కవితను ఈ రోజు ప్రశ్నించారు. ఈ నెల 11వ తేదీ న కూడా ఈడీ అధికారులు విచారణ జరిపారు. ఆరోజు ఆమెను 9 గంటలకు పైగా ప్రశ్నించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ఈ రోజు పూర్తయ్యింది. ఇప్పుడే ఆమె ఈడీ కార్యాలయం నుంచి బైటికి వచ్చారు. దాదాపు 10 గంటల 40 నిమిషాల పాటు ఈడీ అధికారులు కవితను ఈ రోజు ప్రశ్నించారు. ఈ నెల 11వ తేదీ న కూడా ఈడీ అధికారులు విచారణ జరిపారు. ఆరోజు ఆమెను 9 గంటలకు పైగా ప్రశ్నించారు.
కవిత ఈడీ కార్యాలయం నుంచి బైటికి వస్తూ అప్పటికే అక్కడున్న వందలాది మంది బీఆరెస్ కార్యకర్తలకు విక్టరీ సింబల్ చూపిస్తూ కారు ఎక్కి నివాసానికి వెళ్ళిపోయారు.
సౌత్ గ్రూప్ లో కవిత పాత్రపై ఆరా తీస్తున్నారు. అలాగే.. సౌత్ గ్రూప్ లో ఉన్న వ్యక్తులతో వ్యాపార సంబంధాలపై ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు.. ఈ సాయంత్రం ఈడీ ఆఫీస్ కు కవిత న్యాయవాదుల బృందం వచ్చింది. ఈడీ ఆఫీస్ కు తెలంగాణ అడిషనల్ ఏజీ రామచంద్రరావు తో పాటు న్యాయవాదులు గండ్ర మోహన్ రావు, సోమా భరత్ కుమార్ వచ్చారు.
ఈ కేసులో నిందితుడైన రామచంద్ర పిళ్ళై ని కవిత ఎదురుగా కూర్చో బెట్టి విచారణ జరుపుతామని ఈడీ కోర్టుకు చెప్పి పిళ్ళైని కస్టడీలోకి తీసుకుంది. అయితే ఇద్దరిని కలిపి విచారణ జరిపారా లేదా అనేది తెలియరాలేదు. అయితే ఈ రోజు రెండు గంటలకే పిళ్ళై కస్టడీ సమయం అయిపోవడంతో ఆయనను తిహార్ జైలుకు తీసుకెళ్ళారు.
కాగా, కవితను ఈడీ అధికారులు మళ్ళీ రేపు విచారణకు పిలిచారు. మరో వైపు, కవితను ఈడీ విచారించడంపై ఈ నెల 24న సుప్రీం కోర్టులో విచారణ ఉంది.