ఈడీ కి ప్రతీ దాంట్లో జోక్యం చేసుకునే అధికారంలేదు... స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు
మనీలాండరింగ్ కేసులు తప్ప ఇతర కేసుల్లో ఈడీ జోక్యం తగదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌లోని ఫతేపూర్ కోల్ బ్లాక్ కేటాయింపుపై దాఖలైన కేసులో ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది.
ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈడీ తన పరిమితులను దాటి ప్రతి దాంట్లో వేలుపెట్టవద్దని ఢిల్లీ హైకోర్టు సూచించింది.
మనీలాండరింగ్ కేసులు తప్ప ఇతర కేసుల్లో ఈడీ జోక్యం తగదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌లోని ఫతేపూర్ కోల్ బ్లాక్ కేటాయింపుపై దాఖలైన కేసులో ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది.
సెక్షన్ 3 నేరాలను మాత్రమే పరిశోధించడానికి PMLA EDకి అధికారం ఇస్తుంది. అంతేకాని మిగతా విషయాల్లో జోక్యం చేసుకోవడం తన పరిధిని విస్మరించడమేనని హైకోర్టు పేర్కొంది. ఈడీ విచారణ సందర్భంగా ఇతర నేరాలకు సంబంధించిన విషయలు ఏమైనా బహిర్గతమైతే వాటిపై ఇతర ఏజెన్సీలు దర్యాప్తు నిర్వహిస్తాయని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈడీకి పరిమితమైన అధికారాలు మాత్రమే ఉన్నాయని, ఈడీ అధికారాలు అపరిమితమేమీ కాదని కోర్టు గుర్తుచేసింది.