Telugu Global
National

శివసేన పేరు, చిహ్నాన్ని ఉపయోగించకుండా ఈసీ నిషేధం!

శివసేన లోని రెండు వర్గాలకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. రాబోయే ఉప ఎన్నికలో శివసేన పేరును, ఎన్నికల గుర్తును ఎవ్వరూ ఉపయోగించకుండా ఈసీ నిషేధం విధించింది.

శివసేన పేరు, చిహ్నాన్ని ఉపయోగించకుండా ఈసీ నిషేధం!
X

శివసేన పార్టీ ఎన్నికల గుర్తు ఎవరిదనే విషయంలో ఉద్దవ్ ఠాక్రే ఏక్ నాథ్ షిండే వర్గాల మధ్య యుద్దం నడుస్తోంది. ఈ సమస్య ఇప్పుడు ఎన్నికల కమిషన్ కోర్టులో ఉంది. అయితే ఈ లోపు అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమకు శివసేన గుర్తు అయిన విల్లు, బాణం గుర్తు ఇవ్వాలని రెండు వర్గాలు ఈసీ దగ్గర వాధించాయి. ఇరు వర్గాల వాదనలు విన్న ఈసీ అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గాలు పార్టీ పేరును, దాని ఎన్నికల గుర్తును ఉపయోగించకుండా శనివారం నిషేధించింది.

ఉప ఎన్నిక కోసం ఇరు వర్గాలు మరో గుర్తును సూచించాలని ఈసీ సూచించింది. పార్టీ కోసం మూడు పేర్లు, పలు ఎన్నికల చిహ్నాలను సోమవారం నాటికి సూచించాలని ఆదేశించింది ఈసీ.

ఉప ఎన్నిక తర్వాత ఎన్నికల కమిషన్ ఈ కేసును విచారించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే మొత్తానికి ప్రస్తుతానికి రెండు వర్గాలకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది.

First Published:  8 Oct 2022 6:23 PM GMT
Next Story