మూన్‌లైటింగ్‌తో జీతం కంటే ఎక్కువ సంపాదిస్తున్నారా.. ఐటీ నోటీసులొస్తున్నాయ్
కరోనా కాలంలో వర్క్ ఫ్రం హోం చేసినప్పుడే మూన్‌లైటింగ్ ఊపందుకుంది. అందుకే ఆ రెండు ఆర్థిక సంవత్సరాల్లో వారి సంపాదనపైనే ఐటీ డిపార్ట్‌మెంట్ దృష్టి పెట్టింది.
మూన్‌లైటింగ్ చేసి జీతం కంటే ఎక్కువ సంపాదిస్తున్నారా..? అయితే ఆదాయపన్ను శాఖ నోటీసులిస్తోంది.. చూసుకోండి! ఇలా మూన్‌లైటింగ్ చేసి జీతం కంటే ఎక్కువ సంపాదిస్తున్నవారికి ఐటీ శాఖ నోటీసులు పంపిస్తోంది. ఇప్పటికే 2019-20, 2020-21లో ఇలా ఎక్కువ సంపాదించిన 1,100 మందికి నోటీసులిచ్చింది.
ఇలా అదనపు సంపాదన ఆర్జిస్తున్నవారిని ఐటీ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. వీరిలో చాలామంది ఆన్‌లైన్‌లోనూ, కొంతమంది విదేశీ ఛానల్స్ ద్వారా కూడా పేమెంట్స్ అందుకుంటున్నారని గుర్తించింది. ఆ అదనపు ఆదాయాన్ని ట్యాక్స్ లెక్కల్లో చెప్పకపోతే నోటీసులిస్తున్నామని ఐటీ శాఖలోని ఓ సీనియర్ అధికారి చెప్పారు
కరోనా కాలంలో వర్క్ ఫ్రం హోం చేసినప్పుడే మూన్‌లైటింగ్ ఊపందుకుంది. అందుకే ఆ రెండు ఆర్థిక సంవత్సరాల్లో వారి సంపాదనపైనే ఐటీ డిపార్ట్‌మెంట్ దృష్టి పెట్టింది. కొన్ని కంపెనీలు కూడా తమ ఉద్యోగులు ఇలా అధికంగా అదనపు సంపాదన పొందుతున్నారని ఐటీ విభాగానికి సమాచారం ఇస్తున్నాయట! దాంతోపాటు తాము కూడా పరిశీలించి నోటీసులు పంపుతున్నట్లు ఆదాయపన్నుశాఖ చెబుతోంది.