డోంట్ టచ్ మై బాడీ.. ఐ యామ్ మేల్..
ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణలో వెలసిన పోస్టర్లు, బ్యానర్లు.. బాగా హైలెట్ అయ్యాయి. దేశవ్యాప్తంగా వీటిపై చర్చ జరిగింది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కూడా ఇదే ఐడియా ఫాలో అవుతోంది.
ఇటీవల పశ్చిమబెంగాల్ లో బీజేపీ నిరసన ర్యాలీ చేపట్టింది. ఆ ర్యాలీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి కూడా పాల్గొన్నారు. ఓ మహిళా పోలీస్ ఆయన్ను అరెస్ట్ చేసే క్రమంలో సువేందు అధికారి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. "డోంట్ టచ్ మై బాడీ, యు ఆర్ లేడీ, ఐ యామ్ మేల్.." అంటూ సువేందు ఆమెను గద్దించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. సువేందుని టీఎంసీ టీమ్ ఓ ఆట ఆడేసుకుంటోంది.
'నబన్న చలో' ర్యాలీ సందర్భంగా బీజేపీ నేతలు ఓ పోలీస్ వాహనం తగలబెట్టారు. ఈ అల్లర్లలో 15మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ర్యాలీలోనే సువేందు అధికారి 'డోంట్ టచ్ మై బాడీ' వ్యాఖ్యలు చేశారు. అనంతరం బీజేపీ ర్యాలీకి వ్యతిరేకంగా టీఎంసీ మరో కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో టీఎంసీ ప్లకార్డ్ లు హైలెట్ గా నిలిచాయి. టీఎంసీ మంత్రి చంద్రిమా భట్టాచార్య ఆధ్వర్యంలో సువేందు అధికారిని టార్గెట్ చేశారు కార్యకర్తలు. ప్లకార్డ్ లు పట్టుకుని నినాదాలు చేశారు.
ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై కూడా టీఎంసీ ర్యాలీలో సెటైర్లు పేలాయి. 'మోదీజీ.. ఎంటైర్ ఇండియా ఈజ్ ఆన్ సేల్' అంటూ ప్లకార్డ్ లు పట్టుకున్నారు. అందులోనే 'నిర్మలా తాయ్.. ఆల్ అవర్ ఐడియాస్ ఆర్ గోయింగ్ టు ఫెయిల్' అంటూ స్లోగన్లు రాసిన ప్లకార్డులు పట్టుకుని టీఎంసీ కార్యకర్తలు బీజేపీ పరువు తీశారు.
ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణలో వెలసిన పోస్టర్లు, బ్యానర్లు.. బాగా హైలెట్ అయ్యాయి. దేశవ్యాప్తంగా వీటిపై చర్చ జరిగింది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కూడా ఇదే ఐడియా ఫాలో అవుతోంది. ఇటీవల అమిత్ షా పై సెటైరికల్ టీ షర్ట్ లు రూపొందించారు టీఎంసీ నేతలు. మోదీ, నిర్మలా సీతారామన్ పై కూడా ప్లకార్డ్ లతో సెటైర్లు వేస్తున్నారు. ఇక సువేందు అధికారి 'డోంట్ టచ్ మై బాడీ' క్యాప్షన్ అయితే సోషల్ మీడియాలో హాట్ సబ్జెక్ట్ గా మారింది.