Telugu Global
National

అర్బన్ నక్సల్స్ ను గుజరాత్ లోకి రానివ్వకండి.... 'ఆప్' పై మోడీ పరోక్ష దాడి

ఆమ్ ఆద్మీ పార్టీ పై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకపడ్డారు.మారు వేషాలతో గుజరాత్ లోకి ప్రవేశించేందుకు అర్బన్ నక్సల్ ప్రయత్నిస్తున్నారని వారి ప్రయత్నాలను గుజరాత్ ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పరోక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీ గురించి అన్నారు.

అర్బన్ నక్సల్స్ ను గుజరాత్ లోకి రానివ్వకండి.... ఆప్ పై మోడీ పరోక్ష దాడి
X

'అర్బన్ నక్సల్స్' తమ వేషాలు మార్చుకుని గుజరాత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. అయితే యువత జీవితాలను నాశనం చేసే వీరిని గుజరాత్ రాష్ట్రం అనుమతించదని మోదీ సోమవారం అన్నారు. అయితే ఆయన ఈ మాటలన్నది ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి. గుజరాత్‌లోని బరూచ్ జిల్లాలో దేశంలోనే మొట్టమొదటి బల్క్ డ్రగ్స్ పార్క్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మాట్లాడారు.

"అర్బన్ నక్సల్స్ కొత్త రూపాలతో రాష్ట్రంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. వారు తమ వేషధారణలను మార్చుకున్నారు. వారు మన అమాయకులైన, శక్తివంతమైన యువతను తప్పుదారి పట్టిస్తున్నారు" అని మోడీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై పరోక్ష‌ దాడి చేశారు.

"అర్బన్ నక్సల్స్ బైటి నుండి రాష్ట్రంలోకి కాలు మోపుతున్నారు, మన యువ తరాన్ని నాశనం కానివ్వద్దు, దేశాన్ని నాశనం చేసేందుకు రంగంలోకి దిగిన‌ అర్బన్ నక్సల్స్ పట్ల మన పిల్లలను హెచ్చరించాలి. వారు విదేశీ శక్తుల ఏజెంట్లు, గుజరాత్ వారికి తల వంచొద్దు, గుజరాత్ ను వాళ్ళు నాశనం చేస్తారు." అని ప్రధాని అన్నారు.

2014లో తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 10వ స్థానంలో ఉందని, ఇప్పుడు ఐదో స్థానానికి వచ్చిందని మోదీ అన్నారు.

First Published:  10 Oct 2022 3:39 PM IST
Next Story