Telugu Global
National

జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం ప్రభుత్వాలు మానుకోవాలి : సుప్రీంకోర్టు

ప్రభుత్వాలను విమర్శించడం జర్నలిస్టుల హక్కు.. విమర్శించినంత మాత్రాన కేసులు పెట్టడం తప్పు అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తెలిపింది

జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం ప్రభుత్వాలు మానుకోవాలి : సుప్రీంకోర్టు
X

జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం ప్రభుత్వాలు మానుకోవాలని సుప్రీం కోర్టు పేర్కొంది. యూపీకి చెందిన అభిషేక్ ఉపాధ్యాయ్ అనే జర్నలిస్ట్‌పై యూపీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తే భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించినట్లే అవుతుందని స్పష్టం చేసింది. అభిషేక్‌ ఉపాధ్యాయ్‌‌పై ప్రభుత్వంపై ఓ స్టోరీ రాశారు. దీనిపై యూపీ పోలీసులతో పాటు వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.

దీనిని కొట్టివేయాలని కోరుతూ అభిషేక్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీలతో కూడిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.‘ప్రజాస్వామ్య దేశాల్లో భావవ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(a) ప్రకారం జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉంటుంది. కేవలం జర్నలిస్టులు రాసిన కథనాలను విమర్శలుగా భావించి, వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టకూడదు’’ అని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. తదుపరి విచారణ నవంబర్‌ 5కు వాయిదా వేసింది.

First Published:  4 Oct 2024 2:30 PM GMT
Next Story