ఆస్పత్రిలో ఘోరం.. శిశువును నోట కరుచుకెళ్లిన కుక్క.. - మృతిచెందిన శిశువు
దీనిని గమనించిన ఆస్పత్రి సిబ్బంది కుక్కను తరిమికొట్టారు. దీంతో కుక్క శిశువును వదిలి పరారైంది. అనంతరం శిశువును పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు.
బెంగళూరులో ఘోరం చోటుచేసుకుంది. ప్రభుత్వాస్పత్రి ప్రసూతి వార్డులోని శిశువును ఓ కుక్క నోట కరుచుకుని ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో శిశువు మృతిచెందింది. శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వాస్పత్రి ప్రసూతి వార్డులో ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వాస్పత్రి ప్రసూతి వార్డులో ఓ మహిళ శనివారం ఉదయం శిశువుకు జన్మనిచ్చింది. ఉదయం ఏడు గంటల సమయంలో ఓ కుక్క వార్డులోకి ప్రవేశించి.. శిశువును నోట కరుచుకొని ఈడ్చుకెళ్లింది.
దీనిని గమనించిన ఆస్పత్రి సిబ్బంది కుక్కను తరిమికొట్టారు. దీంతో కుక్క శిశువును వదిలి పరారైంది. అనంతరం శిశువును పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఊహించని ఘటనతో శిశువు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.