Telugu Global
National

స‌నాత‌న ధ‌ర్మం ఎయిడ్స్ లాంటిది.. మాట‌ల ఘాటు పెంచిన‌ డీఎంకే

డెంగీ, మ‌లేరియా కాదు స‌నాతన ధ‌ర్మం అంత‌కంటే ఎక్కువంటూ మండిప‌డ్డారు. స‌నాత‌న ధ‌ర్మంపై చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మ‌ని, హోం మంత్రి అమిత్‌షాకు అంత ద‌మ్ముందా అని స‌వాల్ చేశారు.

స‌నాత‌న ధ‌ర్మం ఎయిడ్స్ లాంటిది.. మాట‌ల ఘాటు పెంచిన‌ డీఎంకే
X

స‌నాత‌న ధ‌ర్మం క‌రోనా లాంటిది.. దాన్ని అంతం చేయాల‌న్న డీఎంకే మంత్రి ఉద‌యనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య‌లు దేశ‌వ్యాప్తంగా దుమారం రేపుతూనే ఉన్నాయి. స‌నాత‌న ధ‌ర్మాన్ని అవ‌మానించిన ఉద‌యనిధి త‌ల తెస్తే రూ.10 కోట్లు ఇస్తామ‌ని ఓ సాధువు బహిరంగ ప్ర‌క‌ట‌న చేసేశారు. బీజేపీ, కాంగ్రెస్ స‌హా అన్ని పార్టీలూ డీఎంకే యువ నేత వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నాయి. కానీ, డీఎంకే మాత్రం త‌మ యువ‌నేత‌కు అండ‌గా నిల‌బ‌డింది. అంతేకాదు డీఎంకే ఎంపీ రాజా మ‌రింత ఘాటుగా వ్యాఖ్య‌లు చేసి అగ్గి రాజేశారు.

ఉద‌యనిధి మృదువుగా మాట్లాడారు..

ముఖ్య‌మంత్రి స్టాలిన్ త‌న‌యుడు, మంత్రి ఉద‌యనిధి స్టాలిన్‌ను డీఎంకే ఎంపీ రాజా వెన‌కేసుకొచ్చారు. ఉద‌యనిధి స‌నాత‌న ధ‌ర్మం విష‌యంలో మృదువుగానే మాట్లాడ‌ర‌ని, అదే తాను అయితే దాన్ని క్ష‌య‌, హెచ్ఐవీ లాంద‌ని చెబుతాన‌ని వ్యాఖ్యానించారు. డెంగీ, మ‌లేరియా కాదు స‌నాతన ధ‌ర్మం అంత‌కంటే ఎక్కువంటూ మండిప‌డ్డారు. స‌నాత‌న ధ‌ర్మంపై చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మ‌ని, హోం మంత్రి అమిత్‌షాకు అంత ద‌మ్ముందా అని స‌వాల్ చేశారు.

సీఎం కమారుడికి అండ‌గా పార్టీ

సీఎం స్టాలిన్ కుమారుడు ఉద‌య‌నిధి చేసిన వ్యాఖ్య‌ల‌ను డీఎంకే పూర్తిస్థాయిలో స‌మ‌ర్థిస్తోంది. ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌పై జ‌రుగుతున్న వివాదంపై సీఎం స్టాలిన్ కాస్త ప‌ద్ధతిగానే స్పందించినా.. రాజా లాంటి నేత‌లు మాత్రం త‌గ్గేదే లే అంటున్నారు. చ‌ర్చ‌కు సిద్ధ‌మంటూ స‌వాళ్లు విసురుతున్నారు.

*

First Published:  8 Sept 2023 5:23 AM GMT
Next Story