Telugu Global
National

నేనూ లైంగిక వేధింపుల‌కు గుర‌య్యా.. - మ‌హిళా ఐఏఎస్

త‌న‌కు ఆరేళ్ల వ‌య‌సునప్పుడు ఇద్ద‌రు వ్య‌క్తులు లైంగికంగా వేధించార‌ని కేర‌ళ రాష్ట్రం ప‌థ‌నంథిట్ట జిల్లా క‌లెక్ట‌ర్ దివ్య ఎస్‌. అయ్య‌ర్ తాజాగా వెల్ల‌డించారు.

నేనూ లైంగిక వేధింపుల‌కు గుర‌య్యా.. - మ‌హిళా ఐఏఎస్
X

తానూ చిన్న‌ప్పుడు లైంగిక వేధింపుల‌కు గుర‌య్యాన‌ని కేర‌ళకు చెందిన ఓ ఐఏఎస్ అధికారిణి వెల్ల‌డించారు. త‌న ఆరేళ్ల వ‌య‌సున్న‌ప్పుడు ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ని చెప్పారు. అప్పుడు త‌న‌ను వేధించిన వ్య‌క్తుల ముఖాలు ఇప్ప‌టికీ త‌న‌కు గుర్తున్నాయ‌ని ఆమె తెలిపారు.

త‌న‌కు ఆరేళ్ల వ‌య‌సునప్పుడు ఇద్ద‌రు వ్య‌క్తులు లైంగికంగా వేధించార‌ని కేర‌ళ రాష్ట్రం ప‌థ‌నంథిట్ట జిల్లా క‌లెక్ట‌ర్ దివ్య ఎస్‌. అయ్య‌ర్ తాజాగా వెల్ల‌డించారు. రాష్ట్ర యువ‌జ‌న సంక్షేమ మండ‌లి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌మావేశంలో ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా వివ‌రించారు.

త‌న చిన్న‌నాటి ఘ‌ట‌న‌ను ఆమె వివ‌రిస్తూ.. త‌న ఆరేళ్ల వ‌య‌సులో ఇద్ద‌రు వ్య‌క్తులు త‌న‌ను ఆప్యాయంగా పిలిచార‌ని, తాను వారి వ‌ద్ద‌కు వెళ్లాన‌ని తెలిపారు. వారు త‌న‌ను ఎందుకు ముట్టుకున్నారో, ఆప్యాయంగా మాట్లాడుతున్నారో అర్థం కాలేద‌ని వివ‌రించారు. వారు త‌న దుస్తులు విప్పిన‌ప్పుడు బాధ‌గా అనిపించింద‌ని తెలిపారు. ఆ త‌ర్వాత తాను అక్క‌డినుంచి పారిపోయాన‌ని చెప్పారు. త‌న త‌ల్లిదండ్రుల స‌హ‌కారంతో తాను ఆ బాధ నుంచి త‌ప్పించుకోగ‌లిగాన‌ని వివ‌రించారు.

ఆ ఘ‌ట‌న త‌ర్వాత త‌న‌ను వేధించిన ఇద్ద‌రూ ఎక్క‌డైనా క‌నిపిస్తారేమోన‌ని చూశాన‌ని తెలిపారు. కానీ, ఆ త‌ర్వాత వారు త‌న‌కు క‌నిపించ‌లేద‌ని వివ‌రించారు. వారి ముఖాలు మాత్రం త‌న‌కు ఇప్ప‌టికీ గుర్తున్నాయ‌ని చెప్పారు.

First Published:  30 March 2023 8:02 AM IST
Next Story