ఆరెస్సెస్ కు ఏడు ప్రశ్నలు!
ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ కు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ పలు ప్రశ్నలు సంధించారు. తన ప్రశ్నలకు సరైన జవాబులు వస్తే తాను మోహన్ భగవత్ అభిమానిని అవుతానంటూ దిగ్విజయ్ ట్వీట్ చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ విజయదశమి ప్రసంగంలో మహిళా సాధికారత గురించి మాట్లాడటంపై స్పందించిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు.
"ఆర్‌ఎస్‌ఎస్ మారుతుందా? చిరుతపులి తన మచ్చలను ఎప్పుడైనా మార్చగలదా? ఆరెస్సెస్ స్వభావంలో మౌలిక మార్పులు చేయాలని వారు కోరుకుంటే, మోహన్ భగవత్ జీని నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను?'' అని దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు.
దిగ్విజయ్ చేసిన వరస ట్వీట్లలో ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భవత్ కు ఏడు ప్రశ్నలు సంధించారు.
1.మీరు మీ హిందూ రాష్ట్ర ఎజెండాను వదులుకుంటారా?
2.ఒక మహిళను సర్ సంఘ్‌చాలక్ [చీఫ్]గా నియమిస్తారా?
3.తదుపరి సర్ సంఘ్‌చాలక్‌గా కొంకాస్ట్/చిట్‌పవన్/బ్రాహ్మణేతరులు అవుతారా?
4. OBC/SC/ST సర్ సంఘ్‌చాలక్ ఆరెస్సెస్ లోని అన్ని స్థాయిలవారికి అంగీకారమేనా?
5.మైనారిటీలకు ఆరెస్సెస్ సభ్యత్వం ఇస్తారా?
6.ఆరెస్సెస్‌ను రిజిస్టర్ చేస్తారా?
7.ఆరెస్సెస్ రెగ్యులర్ మెంబర్‌షిప్ ఉంటుందా?
అని ప్రశ్నలు సంధించిన దిగ్విజయ్ సింగ్...
"నా ప్రశ్నలకు/సందేహాలన్నింటికీ మీ నుంచి సానుకూలమైన సమాధానాలు వస్తే అప్పుడు నాకు RSSతో ఎలాంటి సమస్య ఉండదు!! మోహన్ భగవత్ జీ మీరు ఈ పనులన్నీ చేయగలిగితే నేను మీ అభిమానిని అవుతాను," అని దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు.