Telugu Global
National

మహారాష్ట్రలో NDAకు షాక్‌.. ఫడ్నవీస్ రాజీనామా

తాజాగా వ‌చ్చిన‌ సార్వత్రిక ఎన్నికల ఫ‌లితాల్లో మహరాష్ట్రలో మెజార్టీ సీట్లను ఇండియా కూటమి దక్కించుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ తర్వాత దేశంలో అత్యధిక లోక్‌సభ సీట్లు ఉన్నది మహారాష్ట్రలోనే.

మహారాష్ట్రలో NDAకు షాక్‌.. ఫడ్నవీస్ రాజీనామా
X

సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి ప్రతికూల ఫలితాలు రావడంతో మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇకపై పార్టీ కోసమే పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధిష్టానానికి లేఖ రాశారు. తనను డిప్యూటీ సీఎం పదవి నుంచి రిలీవ్ చేయాలని కోరారు.

తాజాగా వ‌చ్చిన‌ సార్వత్రిక ఎన్నికల ఫ‌లితాల్లో మహరాష్ట్రలో మెజార్టీ సీట్లను ఇండియా కూటమి దక్కించుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ తర్వాత దేశంలో అత్యధిక లోక్‌సభ సీట్లు ఉన్నది మహారాష్ట్రలోనే. ఇక్కడ మొత్తం 48 లోక్‌సభ స్థానాలున్నాయి. షిండే శివసేన, అజిత్‌ పవార్‌ NCPలతో కూడిన NDA కూటమి 17 సీట్లకే పరిమితమైంది. ఇక ఉద్ధవ్ థాక్రే శివసేన, శరద్‌పవార్‌ NCP, కాంగ్రెస్‌లతో కూటమి ఇండియా కూటమి 30కిపైగా స్థానాలు గెలుచుకుంది. 13 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్‌ మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

ప్రస్తుత ఫలితాలతో మహారాష్ట్రలో మరోసారి పొలిటికల్‌ హీట్‌ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్‌ NCPలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం ఉంది.

First Published:  5 Jun 2024 3:56 PM IST
Next Story