ప్రజ్వల్‌ని విదేశాలకు పంపించింది దేవెగౌడే – కర్నాటక సీఎం సిద్ధరామయ్య
లైంగిక దాడుల వీడియోల వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ఆయన తాత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడనే విదేశాలకు పంపించారని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు.
లైంగిక దాడుల వీడియోల వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ఆయన తాత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడనే విదేశాలకు పంపించారని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన లైంగిక దాడుల వీడియోల వ్యవహారంలో ప్రజ్వల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
ప్రజ్వల్‌కి సంబంధించిన వీడియోలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో అతను విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రజ్వల్ ఏ దేశంలో ఉన్నదీ ఇప్పటివరకు ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో మాజీ ప్రధాని దేవెగౌడ స్పందిస్తూ ప్రజ్వల్ త్వరగా లొంగిపోవాలని ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. దేవెగౌడే దగ్గరుండి ప్రజ్వల్‌ను విదేశాలకు పంపించారని ఆయన ఆరోపించారు. దేవెగౌడ సూచనలతోనే ప్రజ్వల్ జర్మనీ వెళ్లారని మండిపడ్డారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకే దేవెగౌడ ఇలాంటి ప్రకటన చేశారని విమర్శించారు.
కాగా, ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్‌పోర్టును రద్దు చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్లు కేంద్ర హెూంశాఖ తాజాగా వెల్లడించింది. ప్రజ్వల్ పాస్‌పోర్టును రద్దు చేసేందుకు అవసరమైన చర్యలను కేంద్రం ఇప్పటికే మొదలుపెట్టినట్లు సమాచారం. ఒకవేళ పాస్‌పోర్టు రద్దయితే ప్రజ్వల్ విదేశాల్లో ఉండటం చట్టవిరుద్ధమవుతుంది.