హాస్టల్ బాలికలతో డిప్యూటీ కలెక్టర్ అసభ్య ప్రవర్తన
ఆ నీఛుడికి మనవరాలి వయసున్న అమ్మాయిలు వాళ్లంతా. కానీ వారిని కూడా కామంతో చూశాడు. తన చదువు, హోదా మరచిపోయి పశువులా ప్రవర్తించాడు.

డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి అంటే ఎంతో హుందాగా ఉంటారని అనుకుంటారంతా. కానీ తన నీఛ స్వభావాన్ని అతడు బయటపెట్టుకున్నాడు. నాలుగేళ్లలో పదవీ విరమణ చేయబోతున్న వయసులో హాస్టల్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ దొరికిపోయాడు. చివరకు కటకటాల వెనక్కు వెళ్లాడు.
ఉన్నతాధికారులు హాస్టళ్లకు వచ్చి తనిఖీలు చేయడం సహజం. అలాంటి సందర్భాల్లో వారు విద్యార్థులను వ్యక్తిగతంగా కలసి వివరాలు తెలుసుకుంటారు. అయితే ఏకాంతంగా మాట్లాడాలి అనే నెపంతో విద్యార్థినులను రూమ్ లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు డిప్యూటీ కలెక్టర్ సునీల్ యాదవ్ ఝా. మధ్యప్రదేశ్ లోని ఝాబువా జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న సునీల్ యాదవ్.. గిరిజన బాలికల వసతి గృహం తనిఖీకోసం వచ్చారు. ప్రిన్సిపాల్ ని బయట ఉంచి విద్యార్థినులను రూమ్ లోకి పిలిచి వారితో మాట్లాడారు. కాసేపు కుశల ప్రశ్నలు అడిగి, తర్వాత తనలోని రాక్షస స్వరూపాన్ని బయటపెట్టాడు. అమ్మాయిలను అభ్యంతరకరంగా తాకుతూ, అసభ్యంగా ప్రవర్తించాడు. ఒక్కసారిగా వారు కేకలు వేయడంతో బయట ఉన్న అధికారులు షాకయ్యారు. ఆ తర్వాత అమ్మాయిలు అసలు విషయం చెప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.
ఆ నీఛుడికి మనవరాలి వయసున్న అమ్మాయిలు వాళ్లంతా. కానీ వారిని కూడా కామంతో చూశాడు. తన చదువు, హోదా మరచిపోయి పశువులా ప్రవర్తించాడు. బాధిత విద్యార్థినుల ఫిర్యాదుతో పోలీసులు డిప్యూటీ కలెక్టర్ సునీల్ యాదవ్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరచి, జ్యుడీషియల్ రిమాండ్ కి తరలించారు. జిల్లా కలెక్టర్ నివేదిక ఆధారంగా నిందితుడిని సస్పెండ్ చేశారు.