Telugu Global
National

నోట్ల రద్దు చట్ట వ్యతిరేకం.... సుప్రీం కోర్టు ధ‌ర్మాసనం సభ్యురాలు జస్టిస్ నాగరత్న‌

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం, RBI సెంట్రల్ బోర్డ్ స్వతంత్రంగా నోట్ల రద్దును సిఫార్సు చేసి ఉండాలని, కానీ అది జరగలేదని నోటిఫికేషన్‌ను సవాలు చేసిన‌ పిటిషనర్లతో జస్టిస్ నాగ‌ర‌త్న ఏకీభవించారు.

నోట్ల రద్దు చట్ట వ్యతిరేకం.... సుప్రీం కోర్టు  ధ‌ర్మాసనం సభ్యురాలు జస్టిస్ నాగరత్న‌
X

2016 లో 1,000, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్య చట్టవ్యతిరేకమని సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నాగ‌ర‌త్న తన తీర్పులో పేర్కొన్నారు. ఈ రోజు సుప్రీం కోర్టు 5 గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం .నోట్ల రద్దుపై తీర్పును ఇచ్చింది. అయితే ఈ తీర్పులో నలుగురు న్యాయమూర్తులు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించగా మరో న్యాయమూర్తి జస్టిస్ నాగ‌ర‌త్న ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం, RBI సెంట్రల్ బోర్డ్ స్వతంత్రంగా నోట్ల రద్దును సిఫార్సు చేసి ఉండాలని, కానీ అది జరగలేదని నోటిఫికేషన్‌ను సవాలు చేసిన‌ పిటిషనర్లతో జస్టిస్ నాగ‌ర‌త్న ఏకీభవించారు.

ప్రభుత్వ సలహాతో RBI ఈ చర్య చేపట్టిందని, ఇందులో ఆర్‌బీఐకి ఎలాంటి స్వతంత్రత లేదని ఆమె అభిప్రాయపడ్డారు.

"నా దృష్టిలో, నవంబర్ 8 నాటి నోట్ల రద్దు నోటిఫికేషన్ చట్టవిరుద్ధం. కానీ 2016లో ఉన్న స్థితిని ఇప్పుడు పునరుద్ధరించలేము," అని ఆమె అన్నారు.

ఇది అమలు చేయబడిన విధానం చట్టానికి అనుగుణంగా లేదని, దీని లక్ష్యాలను' తాను ప్రశ్నించడం లేదని, చట్టపరమైన దృక్కోణాన్ని మాత్రమే తాను మాట్లాడుతున్నానని ఆమె అన్నారు.

డీమోనిటైజేషన్ నల్లధనం, తీవ్రవాద నిధులు, నకిలీ నోట్ల‌ వంటి వాటిని లక్ష్యంగా చేసుకుందన్న ప్రభుత్వ వాదనతో తాను వ్యతిరేకింసడంలేదని దాని ఉద్దేశ్యాలు గొప్పవే కావచ్చుకానీ అది చట్టబద్దంగా జరగలేదన్నదే నా అభిప్రాయం'' అని ఆమె తన తీర్పులో పేర్కొన్నారు.

''పిటిషనర్ల వాదనలోని ముఖ్యాంశం కూడా ఏమిటంటే, ఆర్‌బిఐ చట్టం ప్రకారం, నోట్ల రద్దు సిఫార్సు భారతీయ రిజర్వ్ బ్యాంక్ బోర్డు నుండి ప్రభుత్వానికి వెళ్ళవలసి ఉన్నది. కానీ నోట్ల రద్దు చేయాలని కేంద్రం నవంబర్ 7న ఆర్‌బిఐకి లేఖ రాసింది.'' అని నాగరత్న అన్నారు.

డీమోనిటైజేషన్‌ను పార్లమెంటు చట్టం ద్వారా చేయాలని కార్యనిర్వాహక నోటిఫికేషన్ ద్వారా కాదని కూడా జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు.

"కేంద్రం మరియు ఆర్‌బిఐ సమర్పించిన పత్రాలు, రికార్డులను పరిశీలించిన తర్వాత, అందులో ఉన్న "కేంద్ర ప్రభుత్వం కోరుకున్నట్లు" వంటి మాటలు ఆర్‌బిఐ స్వతంత్రంగా వ్యవహరించలేదని అర్దమవుతుంది." అని జస్టిస్ నాగరత్న అన్నారు.

First Published:  2 Jan 2023 9:57 PM IST
Next Story