Telugu Global
National

డేంజర్ లెవల్ దాటిన యమున.. ఢిల్లీలో హై అలర్ట్

గతంలో యమునా నదిలో వచ్చిన అత్యథిక ప్రవాహ స్థాయి 207.49 మీటర్లు. ఈసారి ఆ మార్కు దాటితే రికార్డ్ బ్రేక్ అవుతుంది. అంతే కాదు, ఢిల్లీలోని చాలా ప్రాంతాలు నీటమునిగే ప్రమాదముంది.

డేంజర్ లెవల్ దాటిన యమున.. ఢిల్లీలో హై అలర్ట్
X

వార్నింగ్ లెవల్ 204.5 మీటర్లు

డేంజర్ లెవల్ 205.33 మీటర్లు

ప్రస్తుతం యమున ప్రవాహం 206.28 మీటర్లు..

అంటే డేంజర్ లెవల్ దాటి మరో అడుగు పైన ఉధృతంగా ప్రవహిస్తోంది యమునా నది. ఢిల్లీ వాసులను భయఫ్రాంతులకు గురి చేస్తోంది. ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాలవారిని ఖాళీ చేయిస్తోంది ఢిల్లీ యంత్రాంగం. ఈ ఉప్పెన మరీ ఎక్కువయితే హస్తినకు ముప్పు తప్పదని అంటున్నారు.


దేశ రాజధాని ఢిల్లీ గత 40 ఏళ్లలో ఎప్పుడూ చూడని విలయం ఇది. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కట్టలు తెంచుకునేంత ఉధృతంగా వరదనీరు వస్తోంది. ఈరోజు ఉదయం 6 గంటల సమయానికి ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటి మట్టం 206.28 మీటర్లుగా ఉంది. సాయంత్రానికి ఇది మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. నది ఉద్ధృతితో ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. సోమవారం రాత్రి నుంచే లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు.

ఆ మార్క్ చేరుకుంటే..

గతంలో యమునా నదిలో వచ్చిన అత్యథిక ప్రవాహ స్థాయి 207.49 మీటర్లు. ఈసారి ఆ మార్కు దాటితే రికార్డ్ బ్రేక్ అవుతుంది. అంతే కాదు, ఢిల్లీలోని చాలా ప్రాంతాలు నీటమునిగే ప్రమాదముంది. అయితే ఈసారి అంత ప్రవాహం రాదని అంచనా వేస్తున్నారు అధికారులు. వర్షాలు తగ్గితే ప్రవాహం కూడా తగ్గిపోతుందని అంటున్నారు. యమునా నది ఉద్ధృతితో పాత రైల్వే బ్రిడ్జిపై రైళ్లు, ఇతర వాహనాల రాకపోకలను నిలిపివేశారు. 10 రైళ్లు రద్దు చేశారు, 14 రైళ్లను దారిమళ్లించారు.

First Published:  11 July 2023 10:46 AM IST
Next Story