ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు: ఆప్, బీజేపీ పోటా పోటీ
తాజా సమాచారం ప్రకారం లీడ్లు చూస్తే...ఆప్ 114 మున్సిపల్ వార్డుల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.కాంగ్రెస్ 9 వార్డుల్లో, ఇండిపెండెంట్లు 3 వార్డుల్లో, బీఎస్పీ 1 వార్డులో లీడింగ్ లో ఉన్నారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యింది. ప్రారంభ ట్రెండ్‌ల ప్రకారం ఇప్పటివరకు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు పోటా పోటీ ఫలితాలు సాధిస్తున్నాయి. 11 గంటల వరకు ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఫలితాల మేరకు బీజేపీ 20 సీట్లు గెల్చుకోగా ఆప్ 17 సీట్లు కాంగ్రెస్ 2, ఇండిపెండెంట్ 1 సీటు గెల్చుకున్నారు.
తాజా సమాచారం ప్రకారం లీడ్లు చూస్తే...ఆప్ 114 మున్సిపల్ వార్డుల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.కాంగ్రెస్ 9 వార్డుల్లో, ఇండిపెండెంట్లు 3 వార్డుల్లో, బీఎస్పీ 1 వార్డులో లీడింగ్ లో ఉన్నారు.
250 వార్డులకు డిసెంబర్ 4న జరిగిన పోలింగ్‌లో దాదాపు 50 శాతం ఓటింగ్ నమోదు కాగా, మొత్తం 1,349 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే MCD పోల్స్‌లో AAP విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
కౌంటింగ్ కోసం ఎన్నికల కమిషన్ నగరవ్యాప్తంగా 42 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 68 మంది ఎన్నికల పరిశీలకులను ఈసీ ఇప్పటికే నియమించింది.
అంతేకాకుండా, ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలకు సంబంధించి ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని పరిశీలించేందుకు ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)కి చెందిన 136 మంది ఇంజనీర్లను ఈసీ నియమించింది.