Telugu Global
National

ఢిల్లీ లిక్కర్ స్కాం: చార్జ్ షీట్ లో కేజ్రీవాల్ పేరు

లిక్కర్ స్కాం లో వచ్చిన డబ్బును ఆప్ గతేడాది గోవా ఎన్ని కల సమయం లో ఉపయోగిం చినట్లు ఈడీ పేర్కొం ది. ఆప్ తరపున సర్వే చేసిన వారికి 70 లక్షల సొమ్మును చెల్లించినట్టు ఈడీ చార్జిషీట్ లో తెలిపింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం: చార్జ్ షీట్ లో కేజ్రీవాల్ పేరు
X

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ తన రెండ‌వ చార్జిషీట్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు మరో 17 మంది నిం దితులపై అభియోగాలు నమోదు చేసింది.ఈ మొత్తం కేసులో విజయ్ నాయర్ కీలకం గా వ్యవహరిం చినట్లు ఈడీ వెల్లడించిం ది.

లిక్కర్ స్కాం లో వచ్చిన డబ్బును ఆప్ గతేడాది గోవా ఎన్ని కల సమయం లో ఉపయోగిం చినట్లు ఈడీ పేర్కొం ది. ఆప్ తరపున సర్వే చేసిన వారికి 70 లక్షల సొమ్మును చెల్లించినట్టు ఈడీ చార్జిషీట్ లో తెలిపింది.

డబ్బు బదిలీకి ఢిల్లీఉపముఖ్య మం త్రి మనీష్ సిసోడియా సహాయకుడు దినేష్ అరోరా, హైదరాబాద్‌కు చెం దిన వ్యా పారవేత్త అభిషేక్ సహకరించారని ఈడీ తెలిపిం ది.

కాగా ఈడీ చార్జిషీట్ పై ఢిల్లీముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విరుచుకప‌డ్డారు. ఈడీ బీజేపీ అదుపాజ్ఞ లలో పని చేస్తోందని, అవినీతి నిర్మూలనకు కాకుండా ప్రభుత్వాల కూల్చివేతకు ఈడీ పని చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు.

First Published:  2 Feb 2023 6:48 PM IST
Next Story