Telugu Global
National

ఢిల్లీ లిక్కర్ స్కాం: కేజ్రీవాల్ ను 9 గంటలకు పైగా ప్రశ్నించిన సీబీఐ

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ప్రశ్నించడాన్ని నిరసిస్తూ ఆప్ నేతలు రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్, జాస్మిన్ షా , ఇతర పార్టీ సభ్యులు నిరసనలు చేపట్టగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం: కేజ్రీవాల్ ను 9 గంటలకు పైగా ప్రశ్నించిన సీబీఐ
X

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను 9 గంటల‌కు పైగా ప్రశ్నించింది. సీబీఐ కార్యాలయం నుంచి కొద్ది సేపటి క్రితం ఆయన తన నివాసానికి వెళ్ళిపోయారు.

కాగా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ప్రశ్నించడాన్ని నిరసిస్తూ ఆప్ నేతలు రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్, జాస్మిన్ షా , ఇతర పార్టీ సభ్యులు నిరసనలు చేపట్టగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మమ్ములను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి, తెలియని ప్రదేశానికి తీసుకెళ్తున్నారు... ఇది ఎలాంటి నియంతృత్వం?" అని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు.

ఆప్ నేతలు భగవంత్ మాన్, రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్ తదితరులు గోల్ఫ్ లింక్ రోడ్ వద్ద నిరసనకు దిగారు, పోలీసులు వారిని సీబీఐ కార్యాలయం వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు.

అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ ఆప్ కార్యకర్తలు, ప‍ంజాబ్, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాల్లో నిరసనలు చేపట్టారు.

First Published:  16 April 2023 8:57 PM IST
Next Story