Telugu Global
National

శ్రద్ధావాక‌ర్ కేసు సీబీఐకి బ‌దిలీ చేయాల‌న్న పిటిష‌న్‌ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

మరోవైపు శ్రద్ధా వాకర్ హత్య కేసులో అఫ్తాబ్ పూనావాలా పోలీసు కస్టడీని ఢిల్లీ కోర్టు మరో నాలుగు రోజులు పొడిగించింది.

శ్రద్ధావాక‌ర్ కేసు సీబీఐకి బ‌దిలీ చేయాల‌న్న పిటిష‌న్‌ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
X

ఢిల్లీలో సంచ‌ల‌నం సృష్టించిన శ్ర‌ద్ధావాక‌ర్ హ‌త్య కేసు ద‌ర్యాప్తును ఢిల్లీ పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు మంగ‌ళ‌వారం కొట్టివేసింది. మరోవైపు శ్రద్ధా వాకర్ హత్య కేసులో అఫ్తాబ్ పూనావాలా పోలీసు కస్టడీని ఢిల్లీ కోర్టు మరో నాలుగు రోజులు పొడిగించింది. కేసులో ఇంకా పోలీసుల‌కు దొర‌క‌ని హ‌త్య‌కు ఉప‌యోగించిన‌ ఆయుధంతో పాటు ఇతర సాక్ష్యాలను క‌నిపెట్టేందుకు, ఈ విష‌యంలో ద‌ర్యాప్తుకు స‌హ‌క‌రించేందుకు వీలుగా కోర్టు ఇప్పటికే అంగీకరించిన నార్కో అనాలిసిస్ టెస్ట్ కాకుండా - ఆఫ్తాబ్ పూనావాలాపై పాలిగ్రాఫ్ పరీక్షను నిర్వహించేందుకు కూడా అనుమ‌తించాల‌ని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు.

First Published:  22 Nov 2022 12:56 PM IST
Next Story