Telugu Global
National

కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ.. - జూన్‌ 19 వరకు కస్టడీ పొడిగింపు

కేజ్రీవాల్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం ఆయన జూన్‌ 19 వరకు జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. జైలు అధికారులు ఆయన వైద్య అవసరాలు చూసుకోవాలని కోర్టు ఆదేశించింది.

కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ.. - జూన్‌ 19 వరకు కస్టడీ పొడిగింపు
X

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పెట్టుకున్న మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌కి ఢిల్లీ కోర్టు నో చెప్పింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకునేందుకు మధ్యంతర బెయిల్‌ పొడిగించాలని అభ్యర్థిస్తూ ఆయన పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ బుధవారం ఆదేశాలిచ్చింది.

కేజ్రీవాల్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం ఆయన జూన్‌ 19 వరకు జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. జైలు అధికారులు ఆయన వైద్య అవసరాలు చూసుకోవాలని కోర్టు ఆదేశించింది. మద్యం కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్‌ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం చేసిన అభ్యర్థనను అంగీకరిస్తూ.. కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు జూన్‌ 2న తిరిగి ఆయన జైలు అధికారుల ముందు లొంగిపోయారు. ఆయన ప్రస్తుతం తిహార్‌ జైలులో ఉన్నారు.

First Published:  5 Jun 2024 7:36 PM IST
Next Story