Telugu Global
National

ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో 50శాతం పోలింగ్..

కార్పొరేషన్ అధికారుల వైఫల్యంతో తాము ఓటు వేయాల్సిన పోలింగ్ బూత్ ఎక్కడుందో ఓటర్లు తెలుసుకోలేకపోయారు. చాలామంది ఓటు వేయకుండానే వెనుదిరిగారు. దీంతో పోలింగ్ శాతం తగ్గినట్టు తెలుస్తోంది.

ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో 50శాతం పోలింగ్..
X

ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో 50శాతం పోలింగ్..

ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. కేవలం 50శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. 250వార్డులకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 1,349 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1.45 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా సగానికి సగం మంది మాత్రమే పోలింగ్ బూత్ ల వరకు వచ్చారు. అధికారిక సమాచారం ప్రకారం 50శాతం మాత్రమే పోలింగ్ జరిగింది.

తిరిగి వెళ్లిపోయిన ఓటర్లు..

వాస్తవానికి ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ శాతం మరింత పెరగాల్సి ఉంది. పోటా పోటీగా బీజేపీ, ఆమ్ ఆద్మీ ప్రచారం చేశాయి. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా జోరుగా ప్రచారం చేశారు. ఓటర్లలో కూడా చైతన్యం వచ్చినట్టే కనిపించింది. పోలింగ్ స్టేషన్ల ముందు ఉదయాన్నే ఓటర్లు బారులు తీరారు. అయితే కార్పొరేషన్ అధికారుల వైఫల్యంతో తాము ఓటు వేయాల్సిన పోలింగ్ బూత్ ఎక్కడుందో ఓటర్లు తెలుసుకోలేకపోయారు. చాలామంది ఓటు వేయకుండానే వెనుదిరిగారు. దీంతో పోలింగ్ శాతం తగ్గినట్టు తెలుస్తోంది.

ఆమ్ ఆద్మీ పట్టు సాధించేనా..?

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వమే ఉన్నా.. కార్పొరేషన్లలో మాత్రం బీజేపీదే పెత్తనం. దీంతో ఢిల్లీలో అభివృద్ధి కుంటుపడుతోందని, కార్పొరేషన్లో కూడా తమకే అధికారం అప్పగించాలని ఆమ్ ఆద్మీ ప్రచారం చేసింది. అందులోనూ ఈసారి కార్పొరేషన్లన్నిటినీ ఒక్కటి చేసి ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ధీటుగా కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. ఈనెల 7న ఫలితాలు వెలువడాల్సి ఉంది.

First Published:  4 Dec 2022 9:31 PM IST
Next Story