ఎవరైనా ఆ తుపానుకు కొంచెం చెప్పండి.. అదుపులో ఉండమని
అనుభవం లేకపోయినా ఒకేసారి ఉన్నత పదవిని చేపట్టడం ఎలా ఉందన్న ప్రశ్నకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సమాధానం

అనుభవం లేకపోయినా ఒకేసారి ఉన్నత పదవిని చేపట్టడం ఎలా ఉందని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రశ్న ఎదురైంది. ఒక నేషనల్ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. దానికి ఆమె తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. ఉర్దూ కవిత రహత్ ఇందోరి రాసిన షాయరీని ప్రస్తావించారు. 'నేను కొమ్మల నుంచి రాలిపోయే ఆకులను కాను.. ఎవరైనా ఆ తుపానుకు కొంచెం చెప్పండి.. అదుపులో ఉండమని' అంటూ బదులిచ్చారు. సీఎం కావడం నా కల కాదు. నా దారిలో నేను పనిచేసుకుంటూ ముందుకెళ్లాను. ఈ పదవి లాటరీ కాదు. మన దేశంలో మహిళలపై ఉన్న గౌరవానికి ఇది చిహ్నం. మహిళలకు గుర్తింపు ఇవ్వాలనే సిద్ధాంతంతో సీఎంగా నన్ను నియమించినందుకు ప్రధాని మోడీ, పార్టీ నేతలకు కృతజ్ఞతలు. ఈ నిర్ణయం దేశ మహిళలకు మంచి మెసేజ్ ఇస్తుంది అని రేఖా గుప్తా వెల్లడించారు. గత ప్రభుత్వాల పాలనలోని లోపాలను సరిదిద్దడానికి, అవినీతిని పారదోలేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.