Telugu Global
National

రెజ్లర్ల‌పై పోలీసులు దాడి చేయడం దుర్మార్గం, సిగ్గుచేటు.. కేజ్రీవాల్ ఫైర్

బీజేపీ మొత్తం వ్యవస్థను గుండాయిజంతో నడుపుతోందని, ఆ పార్టీని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.

రెజ్లర్ల‌పై పోలీసులు దాడి చేయడం దుర్మార్గం, సిగ్గుచేటు.. కేజ్రీవాల్ ఫైర్
X

తమను లైంగికంగా వేధిస్తున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను పదవి నుంచి తొలగించాలని రెజ్లర్లు ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే బుధవారం అర్ధరాత్రి రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని రెజ్లర్లు ఆరోపించారు. తమపై దాడి చేయడంతో పాటు దుర్భాషలాడారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెజ్లర్లపై పోలీసులు దాడి చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి.

కాగా, ఈ విషయమై తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. పోలీసులు రెజ్లర్లు పట్ల అమానుషంగా ప్రవర్తించడాన్ని ఆయన ఖండించారు. బీజేపీ మొత్తం వ్యవస్థను గుండాయిజంతో నడుపుతోందని, ఆ పార్టీని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్ ఓ పోస్ట్ చేశారు. '


ఇదిలా ఉండగా రెజ్లర్లకు మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ మద్దతు ప్రకటించారు. గురువారం రెజ్లర్లు ఆందోళన నిర్వహిస్తున్న జంతర్ మంతర్‌లోని శిబిరం వద్దకు స్వాతి మలివాల్ వెళ్లారు. అయితే పోలీసులు ఆమెను కూడా రెజ్లర్లు నిరసన తెలుపుతున్న ప్రదేశం వద్దకు వెళ్ళనివ్వలేదు. పోలీసుల తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ వంటివారు బ్రిజ్ భూషణ్ తమను వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారని, మరి ఢిల్లీ పోలీసులు ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని స్వాతి మలివాల్ ప్రశ్నించారు.

First Published:  4 May 2023 7:25 AM GMT
Next Story