Telugu Global
National

లైంగిక వేధింపులు భరించలేక.. ట్యూటర్‌ పీక కోసిన బాలుడు

14 సంవత్సరాల ఆ బాలుడిని కొన్ని రోజులుగా వసీం లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. అంతేకాదు, ఆ ఘటనను వీడియో కూడా తీసి బయటకు చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు.

లైంగిక వేధింపులు భరించలేక.. ట్యూటర్‌ పీక కోసిన బాలుడు
X

లైంగిక వేధింపులకు ఆడ, మగ తేడా లేదు. కాస్త నిస్సహాయంగా కనపడే వాళ్ళను వేధింపులకి గురి చెయ్యడం, దానిని వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చెయ్యడం అలవాటుగా మారింది. అలాగే ఒక బాలుడిని లైంగిక వేధింపులకు గురి చేశాడు ఒక ట్యూటర్. ఇంట్లో చెప్పే ధైర్యం లేక, ఏం చేయాలో తెలియక ఆ బాలుడే అతని గొంతు కోసిన సంఘటన ఢిల్లీలో జామియా నగర్ ప్రాంతంలో జరిగింది.

ఆగస్టు 30న ఓ ఇంట్లో మృతదేహం పడి ఉందన్న సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని 28 ఏళ్ల ప్రైవేట్ ట్యూటర్‌ వసీంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జరిపిన దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.

14 సంవత్సరాల ఆ బాలుడిని కొన్ని రోజులుగా వసీం లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. అంతేకాదు, ఆ ఘటనను వీడియో కూడా తీసి బయటకు చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. ఆగస్టు 30న ఉదయం 11.30 గంటల సమయంలో బాలుడిని మరోమారు పిలిచాడు. అప్పటికే అతడి చేష్టలతో విసిగిపోయిన ఆ బాలుడు. వసీంను చంపాలని నిర్ణయించుకున్నాడు. షాప్ లో ఒక పేపర్ కట్టర్ కొన్నాడు. దానిని వెంట తీసుకువెళ్లి వసీం గొంతులో పొడిచేసాడు. తరువాత వేసుకున్న బట్టలు మార్చేసి, కటర్ ను దాచేసి మాములుగా ఉండసాగాడు. మూడు రోజుల తరువాత పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

రెండు నెలలుగా తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడనే కారణంతోనే పదునైన ఆయుధంతో హత్య చేసినట్టు ఆ బాలుడు అంగీకరించాడు.

First Published:  4 Sept 2023 3:11 PM IST
Next Story