Telugu Global
National

వికేంద్రీకరణ, పిసిసి చీఫ్‌లకు మరింత అధికారం: థరూర్ మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు

యువ రక్తం, వికేంద్రీకరణ, పిసిసి చీఫ్‌లకు మరింత అధికారం తదితర అంశాలతో శశి థరూర్ తన మ్యానిఫెస్టో ను రిలీజ్ చేశారు. కాంగ్రెస్ అధ్య‌క్ష పదవికి పోటీ పడుతున్న థరూర్ 'థింక్ టుమారో థింక్ థరూర్' అనే ట్యాగ్‌లైన్‌తో, కాంగ్రెస్‌కు 'పునరుజ్జీవనం' కోసం పది ప్ర‌తిపాద‌న‌ల‌తో మ్యానిఫెస్టో రూపొందించారు.

వికేంద్రీకరణ, పిసిసి చీఫ్‌లకు మరింత అధికారం: థరూర్ మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు
X

కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో శశి థరూర్ , మల్లికార్జున్ ఖర్గే పోటీ ప‌డుతున్నారు. ఖర్గే ప్రవేశంతో థరూర్ అవకాశాలు స‌న్న‌గిల్లిన‌ప్ప‌టికీ, కాంగ్రెస్ భవిష్యత్తు కోసం ఆలోచించాలని థ‌రూర్ త‌న మేనిఫెస్టో లో ఓటర్లను కోరారు. "థింక్ టుమారో థింక్ థరూర్" అనే ట్యాగ్‌లైన్‌తో, కాంగ్రెస్‌కు 'పునరుజ్జీవనం' కోసం పది ప్ర‌తిపాద‌న‌ల‌తో మ్యానిఫెస్టో రూపొందించారు. వాటిలో కొన్ని ముఖ్యాంశాలు :

కాంగ్రెస్ కు పున‌రుత్తేజం తెచ్చేందుకు కొంత్త‌వారిని, యువ‌కుల‌ను పార్టీలోకి తీసుకుంటామ‌ని చెప్పారు. యువ‌త ఆకాంక్ష‌లు అర్ధం చేసుకుని ఉత్సాహంతో కాంగ్రెస్ యువ భార‌తాన్న ఆవిష్క‌రిస్తుంద‌ని అన్నారు.

పార్టీని బ‌లోపేతం చేసేందుకు వీలుగా సంస్థాగ‌తంగా కిందిస్థాయి వ‌ర్క‌ర్ నుంచి పిసిసి స్థాయి వ‌ర‌కూ బాధ్య‌త‌ల‌ను వికేంద్రీక‌రిస్తామ‌ని పేర్కొన్నారు. దీనివ‌ల్ల పార్టీలో ప్ర‌తి వారికీ జ‌వాబుదారి త‌నం ఉంటుంద‌ని తెలిపారు. కింది స్థాయినుంచి జాతీయ స్థాయి వ‌ర‌కూ ఇదే విధానం ఉంటుంద‌న్నారు.

ఎఐసిసి ప్రధాన కార్యాలయం పాత్రను వినూత్న రీతిలో ఆధునీకీక‌రిస్తామ‌ని చెప్పారు. పూర్తి సమయం అధ్యక్షుడు "అందరికీ అందుబాటులో ఉండాలి . వారానికి రెండుసార్లు కార్యకర్తలతో పరస్పర చర్చలు జరపాలని మేనిఫెస్టో పేర్కొంది. పార్టీ దార్శనికతను మెరుగుపరిచేలా, పార్టీ అభివృద్ధి చేసే ప్రధాన కార్యదర్శులకు బాధ్యతలు అప్ప‌గించి నియమించాలని పేర్కొంది. అదే విధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులకు మరిన్ని అధికారాలు ఇస్తానని థరూర్ తన మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

సమ్మిళిత భారతదేశం: "భారత జాతీయ కాంగ్రెస్ అంటే "ఇంక్లూజివ్ ఇండియా", మతం, ప్రాంతం, భాష, లింగ భేదం లేకుండా అందరికీ స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం అనే రాజ్యాంగం వాగ్దానానికి అనుగుణంగా ఉంటుంది. "అని పేర్కొంది. అన్ని విష‌యాలు జాతీయ స్థాయి లో అంద‌రితో చ‌ర్చించి స‌మ‌ష్టి నిర్ణ‌యాలు తీసుకోవాలి. ఎన్నికల నిర్వహణను మెరుగుపరచ‌డం. "వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు సీటు ఇవ్వ‌రు.

యువతపై దృష్టి: నిరుద్యోగ యువత, యువత ఎక్కువగా ఉండే ఐటీ రంగం, వలసల హాట్‌స్పాట్‌ల రాజకీయ సామర్థ్యాన్ని కాంగ్రెస్ ఉపయోగించుకోవాలని మ్యానిఫెస్టో పేర్కొంది. "దేశం యొక్క సాంకేతిక నాయకత్వాన్నిఅంది పుచ్చుకోవ‌డానికి , జాబ్ మేళాలు, నైపుణ్యం కలిగిన ఎక్స్‌పోలు, పరిశ్రమ సహకారాన్ని అభివృద్ధి చేయడం ద్వారా కాంగ్రెస్ కీల‌క‌ పాత్ర పోషిస్తుంది.

మ‌హిళా శ‌క్తికి ప్రధాన్యం క‌ల్పిస్తామ‌ని పేర్కొంది. సంస్థాగ‌తంగాను, ఎన్నిక‌ల‌లో సీట్ల కేటాయింపుల‌లో కూడా మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం క‌ల్పిస్తామ‌ని పేర్కొంది. అఖిల‌భార‌త కాంగ్రెస్ ను బలోపేతం చేస్తామ‌ని, మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు ఆమోదానికి గ‌ట్టి కృషిచేస్తామ‌ని పేర్కొంది.

First Published:  3 Oct 2022 1:59 PM GMT
Next Story