Telugu Global
National

ఇండియాలో రష్యా పౌరుల మరణాలు, మిస్సింగులు... ఏం జరుగుతోంది?

కొద్ది రోజుల క్రితం ఒడిశాలోని రాయఘడ లోని ఓ హోటెల్ లో వ్లాదిమిర్ బిడెనోవ్ అనే అతను అనుమానాస్పదంగా మరణించాడు. ఇతను పుతిన్ విధానాల విమర్శకుడు. అతనుమరణించిన వారంరోజుల లోపే అతని స్నేహితుడు రష్యన్ చట్టసభ సభ్యుడు, వ్యాపారవేత్త, పుతిన్ ను వ్యతిరేకించే 65ఏళ్ళ పావెల్ ఆంటోవ్ అనే వ్యక్తి అదే హోటల్ మూడో అంతస్తులోని రూంలోనుండి కింద పడిపోయి మరణించాడు.

ఇండియాలో రష్యా పౌరుల మరణాలు, మిస్సింగులు... ఏం జరుగుతోంది?
X

ఒడిశాలో ఈ మధ్య కాలంలో ఇద్దరు రష్యన్ పౌరులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ రోజు ఓ రష్యన్ పౌరుడు అదృశ్య‌య్యాడు. వీరు ముగ్గురు కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ కు వ్యతిరేకులు.

కొద్ది రోజుల క్రితం ఒడిశాలోని రాయఘడ లోని ఓ హోటెల్ లో వ్లాదిమిర్ బిడెనోవ్ అనే అతను అనుమానాస్పదంగా మరణించాడు. ఇతను పుతిన్ విధానాల విమర్శకుడు. అతనుమరణించిన వారంరోజుల లోపే అతని స్నేహితుడు రష్యన్ చట్టసభ సభ్యుడు, వ్యాపారవేత్త, పుతిన్ ను వ్యతిరేకించే 65ఏళ్ళ పావెల్ ఆంటోవ్ అనే వ్యక్తి అదే హోటల్ మూడో అంతస్తులోని రూంలోనుండి కింద పడిపోయి మరణించాడు.

ఈ ఇద్దరి మరణాల మిస్టరీ ఇంకా తేలక ముందే మరో రష్యా పౌరుడు ఒడిశాలో అదృశ్యం అయ్యాడు.

శుక్రవారం నాడు, భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లో ఒక వ్యక్తి ప్లకార్డుతో కనిపించాడు. ఆ ప్లకార్డ్ లో, ''నేను రష్యన్ శరణార్థిని. నేను యుద్ధానికి వ్యతిరేకం. పుతిన్‌కు వ్యతిరేకం. నేను నిరాశ్రయుడను. దయచేసి సహాయం చేయండి.'' అని రాసి ఉంది. ప్ల కార్డ్ పట్టుకొని అతను ప్రజలను సహాయం కోరుతున్నాడు. ఇప్పుడతను కనిపించడంలేదు. ఏమయ్యాడో ఎవరికీ తెలియ‌డం లేదు.

అయితే, పోలీసులు మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చారు. అతను గత కొంతకాలంగా ఒడిశాలో నివసిస్తున్నాడని, ఒక నెల క్రితం కూడా అదే స్టేషన్‌లో కనిపించాడని చెప్పారు.

గవర్నమెంట్ వద్ద కానీ, రైల్వే పోలీస్ (GRP) వద్ద గానీ రష్యన్ గురించి ఎటువంటి మిస్సింగ్ ఫిర్యాదు నమోదు కాలేదని రైల్వే పోలీసు ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు.

"నవంబర్ నెలలో, మేము మొదట స్టేషన్‌లో ప్ల కార్డు పట్టుకొని నిల్చున్న‌ వ్యక్తిని గుర్తించాము. మేము అతని పాస్‌పోర్ట్‌ను చెక్ చేశాము. అతను ప్రయాణీకుల నుండి డబ్బులు అడుగుతున్నాడు. మేము అతని వివరాలను పరిశీలించి ధృవీకరించాము.అప్పుడే అతన్ని తిరిగి పూరీకి పంపాము. అప్పటి నుండి, అతను తన బృందంతో కలిసి పూరిలో ఉంటున్నాడు. ఈ సంఘటనకు రాయగడ హోటల్ లో జరిగిన మరణాల సంఘటనల‌కు ఎలాంటి సంబంధం లేదు" అని రైల్వే పోలీసు ఉన్నతాధికారి అన్నారు.

అయితే రష్యా పౌరుడు మిస్ అయ్యాడనే వార్త మాత్రం చక్కర్లు కొడుతోంది. పోలీసులు ఏమి చెప్పినప్పటికీ రాయగడ హోటల్ లో సంభవించిన ఇద్దరు రష్యన్ల మరణాలు, ఈ రోజు మరో రష్యన్ మిస్సింగ్ గురించి అక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారు. పైగా వీరు ముగ్గురూ పుతిన్ వ్యతిరేకులు అవడం మరిన్ని అనుమానాలకు దారి తోస్తోంది.

First Published:  31 Dec 2022 2:09 PM GMT
Next Story