తండ్రి పెన్షన్ కోసం వితంతువుగా నటించిన కూతురు
అలీగంజ్‌కు చెందిన విజరత్ ఉల్లా ఖాన్ సర్వేయర్‌గా చేసి రిటైర్డ్ అయ్యారు. భార్య సవియా అతనికంటే ముందుగానే చనిపోగా, 1987లో విజరత్ ఉల్లా ఖాన్ మరణించాడు.
ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వం రకరకాల ఉచిత పెన్షన్లు ఇస్తుంది. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్ అందజేస్తుంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగ విరమణ పొంది మరణిస్తే ఆ పింఛను భార్య అందుకుంటుంది. కానీ, అది కూతురు అందుకోవాలి అంటే ఆమె ఒంటరి అయ్యి ఉండాలి. తండ్రి పెన్షన్ అందుకోవడం కోసం ఉత్తరప్రదేశ్ లో ఓ మహిళ వింత మోసానికి పాల్పడింది.
భర్త ఉన్నప్పటికీ తండ్రి పెన్షన్ కోసం ఆమె వితంతువుగా నటించింది. భర్త ఫిర్యాదుతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అలీగంజ్‌కు చెందిన విజరత్ ఉల్లా ఖాన్ సర్వేయర్‌గా చేసి రిటైర్డ్ అయ్యారు. భార్య సవియా అతనికంటే ముందుగానే చనిపోగా, 1987లో విజరత్ ఉల్లా ఖాన్ మరణించాడు. తండ్రి మరణం తర్వాత ఆ పెన్షన్ డబ్బుల కోసం కుమార్తె మొహాసినా పర్వేజ్ మోసానికి ప్లాన్ చేసింది. ఒక వితంతువుగా నకిలీ పత్రాలు సృష్టించింది. వితంతువు అని చెబుతూ గత పదేళ్లుగా ప్రభుత్వం నుంచి వచ్చిన తండ్రి పెన్షన్ సుమారు రూ.12 లక్షలు పొందింది.
ఈ విషయం ఆమె భర్తకు కూడా తెలుసు. ఇన్నాళ్లు సైలెంట్ గానే ఉన్న అతడు ఇటీవల మొహాసినా పర్వేజ్‌తో గొడవపడ్డాడు. కోపంలో భార్య మోసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మొహాసినాపై కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు.