Telugu Global
National

మహిళలపై నేరాలు: 2022లో జాతీయ మహిళా కమిషన్ కు అందిన ఫిర్యాదులు 31,000

2022లో NCW కు అందిన పిర్యాదుల డాటా కమిషన్ విడుదల చేసింది. మహిళలపై జరిగిన నేరాలపై జాతీయ మహిళా కమిషన్ (NCW) కు 2022లో దాదాపు 31,000 ఫిర్యాదులు అందాయి. ఇది 2014 తర్వాత అత్యధికం. NCWకు 2014 లో 33,906 ఫిర్యాదులు రాగా ఆ తర్వాత 2022లో అందిన ఫిర్యాదుల సంఖ్యే అత్యధికం

మహిళలపై నేరాలు: 2022లో జాతీయ మహిళా కమిషన్ కు అందిన ఫిర్యాదులు 31,000
X

దేశంలో మహిళలపై నేరాలు ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయి. అందులో పిర్యాదు దాకా వచ్చేవి తక్కువే. పోలీసు స్టేషన్ కు కాక డైరెక్ట్ గా జాతీయ మహిళా కమిషన్ (NCW) కు పిర్యాదులు ఇచ్చేవారు మరీ తక్కువ ఉంటారు. అయినా అక్కడ కూడా ప్రతి ఏడాది పిర్యాదుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

2022లో NCW కు అందిన పిర్యాదుల డాటా కమిషన్ విడుదల చేసింది. మహిళలపై జరిగిన నేరాలపై జాతీయ మహిళా కమిషన్ (NCW) కు 2022లో దాదాపు 31,000 ఫిర్యాదులు అందాయి. ఇది 2014 తర్వాత అత్యధికం. NCWకు 2014 లో 33,906 ఫిర్యాదులు రాగా ఆ తర్వాత 2022లో అందిన ఫిర్యాదుల సంఖ్యే అత్యధికం

2021లో NCWకి 30,864 ఫిర్యాదులు అందగా, 2022లో ఆ సంఖ్య 30,957కి పెరిగింది.

NCW డేటా ప్రకారం, 30,957 ఫిర్యాదులలో, గరిష్టంగా 9,710 మహిళలపై మానసిక వేధింపులకు సంబంధించినవి, ఆ తర్వాత గృహ హింసకు సంబంధించినవి 6,970, వరకట్న వేధింపులకు సంబంధించినవి 4,600 ఉన్నాయి.

మహిళల పట్ల అసభ్యత, వేధింపుల నేరాలకు సంబంధించి 2,523 ఫిర్యాదులు అందగా, 1,701 అత్యాచారం, అత్యాచార యత్నాలకు సంబంధించినవి. 1,623 ఫిర్యాదులు మహిళలపై పోలీసుల ఉదాసీనతకు సంబంధించినవి కాగా 924 ఫిర్యాదులు సైబర్ నేరాలకు సంబంధించినవి.

అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌ నుంచి దాదాపు 54.5 శాతం (16,872) ఫిర్యాదులు అందాయి.

ఢిల్లీ నుండి 3,004 ఫిర్యాదులు నమోదయ్యాయి, మహారాష్ట్ర నుండి 1,381 , బీహార్ 1,368, హర్యానా 1,362 పిర్యాదులు నమోదయ్యాయి.

డేటా ప్రకారం, మానసిక వేధింపులు, గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదులలో అత్యధిక సంఖ్యలో ఉత్తరప్రదేశ్ నుండి వచ్చాయి.

మహిళలపై ఎక్కువగా నేరాలు ఉత్తర భారతంలోనే జరుగుతుండటం గమనించాల్సిన విషయం. అందులోనూ ఉత్తరప్రదేశ్ మహిళలపై నేరాలకు రాజధానిగా ఉంది. నిజం చెప్పాలంటే భారత క్రైం రాజధానిగా ఉత్తరప్రదేశ్ ఉన్నదని చెప్పుకోవడ‍ం అతిశయోక్తి కాదు

First Published:  2 Jan 2023 8:20 AM GMT
Next Story