Telugu Global
National

పెరుగుతున్న కొవిడ్ కేసులు.. మళ్లీ భయపెడుతున్నారా..?

దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య, మరణాల్లో ఎటువంటి పెరుగుదల నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌ తెలిపారు.

Coronavirus cases rises in India again
X

పెరుగుతున్న కొవిడ్ కేసులు.. మళ్లీ భయపెడుతున్నారా..?

కొవిడ్ పంజా విసిరిన సమయంలో రోజుకిన్ని కొత్త కేసులు, రికవరీలు, మరణాలు.. అంటూ రోజూ ఓ లిస్ట్ విడుదల చేసేవారు. ఆ లిస్ట్ చూసి జనం హడలిపోయేవారు. వాస్తవంగా ఉన్న పరిస్థితి వేరు, గణాంకాలు చూసిన తర్వాత పెరిగే ఆందోళన వేరు. మళ్లీ ఇప్పుడు కొవిడ్ కేసులు పెరుగుతున్నాయంటూ కేంద్రం హింట్ ఇస్తోంది. 140 రోజుల తర్వాత మళ్లీ ఇపుడు దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8.00 గంటల వరకు దేశంలో 1,300 కొవిడ్‌ కేసులను గుర్తించారు. ముందురోజుతో పోలిస్తే 166 కేసులు పెరిగాయి.

కర్నాటక, గుజరాత్, మహారాష్ట్ర..

కొవిడ్ కారణంగా కర్నాటక, గుజరాత్‌, మహారాష్ట్రల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఒక్కరోజే 718 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 98.79 శాతంగా ఉందన్నారు అధికారులు. యాక్టివ్‌ కేసులు కేవలం 0.02 శాతం మాత్రమే. దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య, మరణాల్లో ఎటువంటి పెరుగుదల నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌ తెలిపారు.

XBB-1.16

కొవిడ్ లో కొత్త వేరియంట్ అంటూ మరో పేరు తెరపైకి వచ్చింది. తాజాగా పెరుగుతున్న కేసులకు కారణం XBB-1.16 వేరియంట్ అంటున్నారు వైద్య నిపుణులు. దేశవ్యాప్తంగా కొవిడ్‌ పాజిటివ్‌ కేసులకు నిర్వహించిన జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ లో 344 కేసులు XBB-1.16 వేరియంట్ కి సంబంధించినవి అని నిర్థారించారు. ఈ వేరియంట్ తొలిసారిగా జనవరి లో వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి, మార్చిలో కేసులు వందల్లోకి వచ్చాయి.

9 రాష్ట్రాల్లో ఈ వేరియంట్ వ్యాప్తి చెందిందని అంటున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో ఈ వేరియంట్‌ కేసులు బయటపడ్డాయి. కొవిడ్‌ కేసులు పెరగడానికి ఈ కొత్త వేరియంట్‌ కారణమై ఉండొచ్చని, అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదని ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ రణదీప్ గులేరియా అన్నారు. వైరస్‌ లో మ్యుటేషన్లు జరుగుతున్నకొద్దీ ఇలాంటి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయన్నారు.

First Published:  24 March 2023 6:32 AM IST
Next Story