మళ్ళీ భయపెడుతున్న కరోనా.... ఒక్క రోజులో 40 శాతం పెరిగిన కేసులు
దేశంలో 14 తాజా మరణాలతో కోవిడ్ -19 మరణాల సంఖ్య 5,30,862 కు పెరిగింది. ఈ 24 గంటల్లో కేరళలో 8మంది, మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు కోవిడ్ తో మరణించారు.
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గురువారం 3,016 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఈ ఆరునెలల్లో అత్యధికం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించిన డేటా ప్రకారం ఈ రోజు క్రియాశీల కేసులు 13,509కి చేరాయి. గతేడాది అక్టోబర్ 2న మొత్తం 3,375 కేసులు నమోదయ్యాయి.
దేశంలో 14 తాజా మరణాలతో కోవిడ్ -19 మరణాల సంఖ్య 5,30,862 కు పెరిగింది. ఈ 24 గంటల్లో కేరళలో 8మంది, మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు కోవిడ్ తో మరణించారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఒక్కరోజే 300 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. పరిస్థితిని సమీక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సీనియర్ ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వ ఆసుపత్రుల మెడికల్ డైరెక్టర్లు హాజరయ్యారు.
మహారాష్ట్రలో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. షోలాపూర్, సాంగ్లీ జిల్లాలు కోవిడ్-19 పాజిటివిటీ చార్టులో అగ్రస్థానంలో ఉన్నాయి
మార్చిలో షోలాపూర్, సాంగ్లీ జిల్లాలు వరుసగా 20.05 శాతం, 17.47 శాతం రేటుతో మహారాష్ట్రలో అగ్రస్థానంలో ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది.
“నాలుగు వారాల క్రితం, రాష్ట్రంలో కోవిడ్ పాజిటీవ్ కేసులు 1.05 శాతం ఉండగా, మార్చి 22, 28 మధ్య, ఇది 6.15 శాతం పెరిగింది. షోలాపూర్ (20.05 శాతం), సాంగ్లీ (17.47 శాతం), కొల్హాపూర్ (15.35 శాతం), పూణే (12.33 శాతం), నాసిక్ 7.84 శాతం, అహ్మద్‌నగర్ (7.56 శాతం) కోవిడ్ పాజిటీవ్ కేసులు ఉన్నాయి.'' అని ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.