Telugu Global
National

జ్ఞానవాపీ మసీదు కేసులో హిందువుల పిటిషన్ తిరస్కరించిన కోర్టు

జ్ఞాన్‌వాపి మసీదు కేసులో శివలింగం ఏ కాలంనాటిదోని నిర్ధారించడానికి కార్బన్ డేటింగ్ వంటి శాస్త్రీయ పరిశోధనలు నిర్వ‌హించాల‌న్న‌ హిందూ పిటిషనర్ల డిమాండ్‌ను శుక్ర‌వారంనాడు వారణాసి జిల్లా కోర్టు తిరస్కరించింది.

జ్ఞానవాపీ మసీదు కేసులో హిందువుల పిటిషన్ తిరస్కరించిన కోర్టు
X

వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు కేసులో హిందూ పక్షానికి ఎదురుదెబ్బ త‌గిలింది. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో వెలుగుచూసిన 'శివలింగం ఏ కాలంనాటిదోని నిర్ధారించడానికి కార్బన్ డేటింగ్ వంటి శాస్త్రీయ పరిశోధనలు నిర్వ‌హించాల‌న్న‌ హిందూ పిటిషనర్ల డిమాండ్‌ను శుక్ర‌వారంనాడు వారణాసి జిల్లా కోర్టు తిరస్కరించింది.

మసీదు సముదాయంలోని ఓ దేవ‌త మందిరంలో ఏడాది పొడ‌వునా పూజ‌లు చేసుకునేందుకు అనుమతించాల‌ని కోరుతూ ఐదుగురు హిందూ మహిళలు పిటిష‌న్ దాఖలు చేశారు. దీనిపై అక్క‌డ దేవ‌తా మ‌దిరం ఉన్న‌దా అనే విష‌య‌మై దిగువ కోర్టు వీడియో స‌ర్వే కోసం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో వీడియో సర్వే చేస్తుండ‌గా ఈ శివ‌లింగం బ‌య‌ట‌ప‌డింది.

ఆ కేసు ఇంకా విచారణలో ఉంది. ఈ శివ‌లింగం ఏ నాటిదో తేల్చేందుకు కార్బ‌న్ డేటింగ్ వంటి పరీక్ష‌లు చేయించేందుకు ఈ ఐదుగురు మ‌హిళ‌ల‌లో ఒక‌రు నిరాక‌రించారు.

మసీదు లోపల ప్రదేశాన్ని సీలు చేసినందున కార్బన్ డేటింగ్ వంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుందని వారణాసిలోని కోర్టు పేర్కొంది.

గత నెలలో, ఐదుగురు హిందూ పిటిషనర్లలో నలుగురు "శివలింగం"పై "శాస్త్రీయ దర్యాప్తు" కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దాని వయస్సును నిర్ణయించడం అవసరమని వారు వాదించారు. మసీదు లోపల పురాతన హిందూ దేవతలు, దేవతల విగ్రహాలు ఉన్నాయని మహిళలు పేర్కొన్నారు.

First Published:  14 Oct 2022 3:53 PM IST
Next Story