Telugu Global
National

పబ్లిక్‌లో పాడు పని.. ప్రశ్నించిన ఎస్సైని కారుతో ఢీ కొట్టిన జంట

బెంగళూరు నగరంలో గురువారం ఓ జంట పబ్లిక్‌లో కారు నిలిపి అసభ్యకర పనులు చేయడం మొదలుపెట్టగా..దీనిని ప్రశ్నించిన సబ్ ఇన్‌స్పెక్టర్‌ను కారుతో ఢీ కొట్టి పరారయ్యారు.

పబ్లిక్‌లో పాడు పని.. ప్రశ్నించిన ఎస్సైని కారుతో ఢీ కొట్టిన జంట
X

బెంగళూరు నగరంలో గురువారం ఓ జంట పబ్లిక్‌లో కారు నిలిపి అసభ్యకర పనులు చేయడం మొదలుపెట్టగా..దీనిని ప్రశ్నించిన సబ్ ఇన్‌స్పెక్టర్‌ను కారుతో ఢీ కొట్టి పరారయ్యారు. ఈ సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. బెంగళూరు నగరం జ్ఞాన భారతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పార్కు వద్దకు గురువారం ఉదయం ఓ కారు వచ్చి ఆగింది. పార్కు వద్ద ఉన్న జనం చూస్తుండగానే వాహనంలో ఉన్న యువతి, యువకుడు నగ్నంగా మారి శృంగారంలో మునిగిపోయారు. చుట్టుపక్కల జనం చూస్తున్నా వారు దీనిని పట్టించుకోలేదు.

పార్కు వద్దే ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్ మహేష్ వాహనం వద్దకు వచ్చి ఇక్కడి నుంచి తక్షణమే వెళ్లిపోవాలని ఆ జంటను హెచ్చరించాడు. అయినా వారు పట్టించుకోకపోవడంతో కారు ముందుకు వచ్చి వాహన నెంబరు నోట్ చేసుకుంటుండగా అకస్మాత్తుగా ఆ జంట కారును స్టార్ట్ చేసి ఎస్సైని ఢీకొట్టారు. కారు ఢీకొన్న దాటికి ఎస్సై ఎగిరి వాహనం బానెట్‌పై పడ్డాడు. వెంటనే కారును రివర్స్ చేసుకున్న జంట అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది.

పార్కులోని జనం వాహనాన్ని ఆపే ప్రయత్నం చేసినా ఆ జంట పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయింది. కారు ఢీకొనడం, రివర్స్ చేసేటప్పుడు కింద పడిపోవడంతో ఎస్సై మహేష్‌కి తీవ్ర గాయాలు కాగా.. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జ్ఞాన భారతి పోలీసులు కేసు నమోదు చేసుకొని పారిపోయిన జంట కోసం గాలింపు చేపట్టారు. పబ్లిక్ ప్లేస్‌లో అందరూ చూస్తుండగా శృంగారానికి దిగడంతో పాటు.. వారించిన ఎస్సైని కారుతో ఢీ కొట్టి వెళ్లిపోవడం బెంగళూరులో కలకలం రేపింది.

First Published:  25 Jan 2024 3:35 PM
Next Story