Telugu Global
National

651 అత్యవసర మెడిసిన్ పై 6.73 శాతం తగ్గిన ధరలు

నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (NLEM) కింద జాబితా చేయబడిన మొత్తం 870 షెడ్యూల్డ్ డ్రగ్స్‌లో ఇప్పటివరకు 651 ఔషధాల ధరలపై ప్రభుత్వం సీలింగ్ విధించందని జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఒక ట్వీట్‌లో పేర్కొంది.

651 అత్యవసర మెడిసిన్ పై 6.73 శాతం తగ్గిన ధరలు
X

651 అత్య‌వసరమైన ఔషధాల ధరలు ఏప్రిల్ 1 నుండి సగటున 6.73 శాతం తగ్గాయని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ( NPPA) సోమవారం తెలిపింది.

నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (NLEM) కింద జాబితా చేయబడిన మొత్తం 870 షెడ్యూల్డ్ డ్రగ్స్‌లో ఇప్పటివరకు 651 ఔషధాల ధరలపై ప్రభుత్వం సీలింగ్ విధించందని జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఒక ట్వీట్‌లో పేర్కొంది.

ధరలు తగ్గించిన వాటిలో జ్వరానికి ఉపయోగించే పారాసెటమాల్, యాంటీ బయోటిక్ మెడిసిన్ అమోక్సి సిలిన్, యాంటీ డయాబెటిక్ మెడిసిన్ గ్లిమెపిరైడ్, మెట్ ఫార్మిన్ తదితర మందులున్నాయి.

ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ( NPPA) గత సంవత్సరం ఏప్రెల్ లో 870 రకాల మందులపై 12.12 శాతం ధరలు పెంచింది. అయితే ఈ సారి కేంద్రం ప్రభుత్వం 651 మందులపై 6.73 శాతం ధరలు తగ్గించి సామాన్యుడికి కొంత ఊరటనిచ్చింది.

First Published:  3 April 2023 9:54 PM IST
Next Story