మరో 12 రోజులపాటు కరోనా విజృంభణ...నిపుణుల అంచనా
మరో 12 రోజుల పాటు కరోనా వైరస్ ఉద్ధృతి ఉంటుందని ఆతర్వాత తగ్గుముఖం పడుతుందని నిపుణులు అంటున్నారు. దేశంలో కరోనా ఎండ్‌మిక్ దశకు చేరుకుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
BY Telugu Global13 April 2023 10:00 AM IST
X
Telugu Global Updated On: 13 April 2023 10:09 AM IST
దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 7,830 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 11 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 40 వేలకు చేరుకున్నాయి.
మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఒక్క రోజులో 1,115 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 9 మంది మరణించారు.
ఈ నేపథ్యంలో దేశ్వ్యాప్తంగా ఆందోళన నెలకొనగా నిపుణులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. మరో 12 రోజుల పాటు కరోనా వైరస్ ఉద్ధృతి ఉంటుందని ఆతర్వాత తగ్గుముఖం పడుతుందని అంటున్నారు. దేశంలో కరోనా ఎండ్‌మిక్ దశకు చేరుకుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Next Story