బీజేపీ, ఆరెస్సెస్ ల కంచు కోటలో కాంగ్రెస్ విజయం | Congress victory in the stronghold of BJP and RSS
Telugu Global
National

బీజేపీ, ఆరెస్సెస్ ల కంచు కోటలో కాంగ్రెస్ విజయం

ఈ ఎన్నికల్లో ఎంవిఎకు చెందిన సుధాకర్ అద్బలే నాగ్‌పూర్ ఉపాధ్యాయ స్థానాన్ని గెలుచుకున్నారు, బిజెపి మద్దతు ఉన్న నాగో గనార్‌ను ఓడించారు.

బీజేపీ, ఆరెస్సెస్ ల కంచు కోటలో కాంగ్రెస్ విజయం
X

ఆరెస్సెస్ రాజధాని, బీజేపీకి గట్టి కోట, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ల స్వంత గడ్డపై బీజేపీకి పరాభవం ఎదురయ్యింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్థిని ఓడించి ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA) కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించారు.

ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను ముఖ్యమంత్రి పీఠం మీది నుంచి దించి అసమ్మతి వాది ఏక్నాథ్ షిండే, గత సంవత్సరం జూన్‌లో బిజెపితో పొత్తుపెట్టుకుని ముఖ్యమంత్రి అయిన‌ తర్వాత రాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి కీలక పోటీ ఇది. ఈ ఎన్నికల్లో ఎంవిఎకు చెందిన సుధాకర్ అద్బలే నాగ్‌పూర్ ఉపాధ్యాయ స్థానాన్ని గెలుచుకున్నారు, బిజెపి మద్దతు ఉన్న నాగో గనార్‌ను ఓడించారు.

ఐదుగురు కౌన్సిల్ సభ్యుల 6 సంవత్సరాల పదవీకాలం ఫిబ్రవరి 7న ముగుస్తుంది. అందులో ముగ్గురు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాగా ఇద్దరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు. ఈ 5 స్థానాలకు ప్రధానంగా పోటీ బీజేపీ, షిండే కూటమికి ఉద్దవ్ ఠాక్రే శివసేన, కాంగ్రెస్, ఎన్ సీపీ ల MVA కూటమికి మధ్య జరిగాయి. నాగ్ పూర్ ఫలితం వెలువడగా మిగతా ఫలితాలు రావాల్సి ఉంది.

First Published:  3 Feb 2023 2:30 AM
Next Story