Telugu Global
National

హిమాచల్ లో మహిళా భరోసా.. కాంగ్రెస్ కి కలిసొచ్చేనా..?

18నుంచి 60ఏళ్లలోపు వయసున్న మహిళలందరికీ ప్రతినెలా 1500 రూపాయలు ఆర్థికసాయం చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మహిళా భరోసాపై కాంగ్రెస్ గట్టి నమ్మకం పెట్టుకుంది.

హిమాచల్ లో మహిళా భరోసా.. కాంగ్రెస్ కి కలిసొచ్చేనా..?
X

హిచమాల్ ప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈసారి కమలదళం నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోన్న కాంగ్రెస్ హామీల వర్షం కురిపించింది. 18నుంచి 60ఏళ్లలోపు వయసున్న మహిళలందరికీ ప్రతినెలా 1500 రూపాయలు ఆర్థికసాయం చేస్తామని ప్రకటించింది. మహిళా భరోసాపై కాంగ్రెస్ పార్టీ గట్టి నమ్మకం పెట్టుకుంది. పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకొస్తామని కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

లక్ష ఉద్యోగాలు...

ఆర్థిక సాయంతోపాటు, లక్ష ఉద్యోగాలు కల్పిస్తామంటూ కాంగ్రెస్ భారీ హామీ ఇచ్చింది. ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పింది. 680 కోట్లతో స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి అభ్యర్థిపై మాత్రం కాంగ్రెస్ ప్రకటన విడుదల చేయలేదు. గెలిచిన ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రిని ఎన్నుకొంటారని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

బీజేపీపై విమర్శల వర్షం..

బీజేపీ పాలనలో హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధిలో వెనకపడిందని విమర్శించింది కాంగ్రెస్ పార్టీ. ఐదేళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ముందు విడుదల చేసిన మేనిఫెస్టోని కచ్చితంగా అమలు చేస్తామని ఇది రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రూపొందించిన పత్రం అని పేర్కొన్నారు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జ్ రాజీవ్‌ శుక్లా.

First Published:  5 Nov 2022 9:08 PM IST
Next Story