Telugu Global
National

పాంచ్‌ న్యాయ్‌.. 5 గ్యారంటీలతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో

పాంచ్‌ న్యాయ్‌ పేరుతో మేనిఫెస్టోను రూపొందించింది కాంగ్రెస్‌. ఇందులో ఐదు గ్యారంటీలను పొందుపరిచింది. హిస్సేదారి న్యాయ్‌, యువన్యాయ్‌, కిసాన్ న్యాయ్‌, నారీ న్యాయ్‌, శ్రామిక్ న్యాయ్ పేరుతో గ్యారంటీలను ప్రకటించింది.

పాంచ్‌ న్యాయ్‌.. 5 గ్యారంటీలతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో
X

కర్ణాటక, తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్‌ రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం.. ఐదు గ్యారంటీలతో మేనిఫెస్టోను సిద్ధం చేసింది. మంగళవారం కాంగ్రెస్‌ వర్కింగ్ సమావేశంలో ఈ మేనిఫెస్టోకు ఆమోదం తెలిపింది.

పాంచ్‌ న్యాయ్‌ పేరుతో మేనిఫెస్టోను రూపొందించింది కాంగ్రెస్‌. ఇందులో ఐదు గ్యారంటీలను పొందుపరిచింది. హిస్సేదారి న్యాయ్‌, యువన్యాయ్‌, కిసాన్ న్యాయ్‌, నారీ న్యాయ్‌, శ్రామిక్ న్యాయ్ పేరుతో గ్యారంటీలను ప్రకటించింది. ఒక్కో గ్యారంటీ కింద మళ్లీ ఐదు హామీలను పొందు పరిచింది. ఇలా మొత్తంగా 25 హామీలను మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్‌.


కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోని 10 కీలక హామీలు ఇవే -

- దేశవ్యాప్తంగా కులగణన

- SC, ST, OBC రిజర్వేషన్లపై 50 శాతం క్యాప్ తొలగింపు, రాజ్యాంగ సవరణ

- దేశవ్యాప్తంగా యువతకు 30 లక్షల ఉద్యోగాలు

- పేపర్‌ లీకులను నివారించేందుకు కఠినమైన చట్టం

- యువత కోసం రూ.5 వేల కోట్లతో స్టార్టప్ ఫండ్

- స్వామినాథన్‌ సిఫార్సుల మేరకు MSPకి చట్టబద్ధత

- రుణమాఫీ కమిషన్ ఏర్పాటు

- పేద మహిళలకు ఏడాదికి రూ.లక్ష ఆర్థికసాయం

- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్

- రోజువారీ కూలీ రూ.400 పెంపు, ఉపాధి హామీ కూలీలకు వర్తింపు

- ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్టు పద్ధతి ఎత్తివేత

First Published:  20 March 2024 10:33 AM IST
Next Story