Telugu Global
National

భారత్ జోడో యాత్ర ఆపండి- రాహుల్‌కు కాంగ్రెస్ ఎంపీ సలహా

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆపేసి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రాన్సిస్కో సర్దిన్హా సలహా ఇచ్చారు. బీజేపీని ఓడించగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని ఆయన అన్నారు.

భారత్ జోడో యాత్ర ఆపండి- రాహుల్‌కు కాంగ్రెస్ ఎంపీ సలహా
X

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తక్షణం ఆపేయాలని ఆ పార్టీ ఎంపీ, గోవా మాజీ ముఖ్యమంత్రి ప్రాన్సిస్కో సర్దిన్హా సలహా ఇచ్చారు. రాహుల్ వెంటనే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఆయన కోరారు.


బీజేపీని ఓడించగలిగే సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని, ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి ప్రజలను చైతన్యవంతులను చేసి కాంగ్రెస్ కు ఓటు వేసే విధంగా ప్రయత్నించే బదులు పాదయాత్ర చేస్తే ఉపయోగం ఉండదని ప్రాన్సిస్కో సర్దిన్హా వ్యాఖ్యానించారు.


''రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ఆపి హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లకు వెళ్లి ప్రజలను మేల్కొల్పాలని కోరుకుంటున్నాను. తద్వారా బిజెపిని ఓడించగల ఏకైక పార్టీ అయిన కాంగ్రెస్ కు ప్రజలు ఓటు వేసేవిధంగా చేయాలి.'' అని అన్నారు కాంగ్రెస్ ఎంపీ ఫ్రాన్సిస్కో సర్దిన్హా.


ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోస‍ం జరుగుతున్న ఎన్నికల్లో సోమవారం కర్ణాటకలోని బళ్లారిలో భారత్ జోడో యాత్ర క్యాంప్‌సైట్‌లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఓటు వేశారు.


సెప్టెంబరు 7న ప్రారంభమైన కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల యాత్రలో 40వ రోజైన సోమవారం సంగనకల్లులో రాహుల్ "విశ్రాంతి దినం" పాటిస్తున్నారు.





First Published:  17 Oct 2022 5:37 PM IST
Next Story